/rtv/media/media_files/2024/11/25/6XkrU7jFWfeok46uVImL.jpg)
సోమవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం లోక్‌సభ, రాజ్యసభలకు సెలవు ఉంటుంది. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాల జరగనున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా పాత పార్లమెంటు భవనంలో సెంట్రల్ హల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక సభా వ్యవహారాల సంఘం (బీఏసీ)లో నిర్ణయించినటువంటి అంశాల ఆధారంగా మిగిలిన రోజుల్లో సభలు జరగనున్నాయి. ఆదివారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్యర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి 30 పార్టీ నుంచి 42 మంది నేతలు హాజరయ్యారు.
Also Read: మహారాష్ట్ర సీఎం ఎవరూ ? మరికొన్ని గంటల్లో స్పష్టత
ఇక సమావేశాల్లో అన్ని అంశాలపై కూడా రెండు సభల్లో చర్చలు జరగాలని కోరుకుంటున్నామని.. ప్రభుత్వం కూడా దీనికి సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియా సమావేశంలో తెలిపారు. '' రాజ్యంగంతో ముడిపడిన అనేక అంశాలను పుస్తకరూపంలో తీసుకొస్తున్నాం. దీన్ని రూపొందించడానికి ముందు ఏం జరిగింది అనే విషయాలు చాలామందికి తెలియదు. రాజ్యాంగం అనది సాధారణ పుస్తకం కాదు. దీనిలో ఉన్నటువంటి చిత్రాలు, వర్ణనలు, ప్రధానోద్దేశాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని'' తెలిపారు. ఇక సమావేశాల్లో మొత్తం 17 బిల్లులు చర్చలకు రానున్నాయి.
Also Read: వివాహిత అపహరణ..బంధీగా ఉంచి 14 రోజులుగా అత్యాచారం!
ఇదిలాఉండగా ప్రస్తుతం అదానీ లంచం కేసు అంశం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్ష పార్టీ అదానీ అంశంపై చర్చించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్లమెంటులో చర్చించాలని తాము అఖిలపక్షంలో డిమాండ్ చేశామని కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగొయ్ తెలిపారు. ఈ స్కామ్ అమెరికాలో బయటపడినందున దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలని తెలిపారు. ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేయకుండా మణిపుర్ హింసపై సమాధానమివ్వాలని చెప్పారు. ఝార్ఖండ్ సీఎంను జైలుకు పంపిన కేంద్ర ప్రభుత్వం మణిపుర్ సీఎంను ఎందుకు ఉపేక్షిస్తోందని ప్రశ్నించారు.
Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు.. పంబ వరకూ క్యూలైన్!
Also Read: మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్