మోదీ అమెరికా పర్యటన.. ! ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయ్యాక కీలక చర్చలు

ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికా పర్యటన చేయనున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ట్రంప్ 2వసారి ప్రెసిడెంట్ అయ్యాక మోదీ అమెరికా విజిట్ ఇదే ఫస్ట్ కానుంది.

New Update
modi us tour

modi us tour Photograph: (modi us tour)

ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీని కోసం అమెరికా, భారత్ రెండూ దేశాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన అన్నారు. త్వరలోనే మోదీ యూఎస్ టూర్ షెడ్యూల్ ప్రకటిస్తామని రణధీర్ జైస్వాల్ చెప్పారు. వచ్చే నెల ఫిబ్రవరిలో మోదీ అమెరికా పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. అమెరికా, భారత్ లు అక్రమవలసలపై పోరాడుతున్నాయని జైస్వాల్ అన్నారు.

ఇది కూడా చదవండి :Sunita Williams: అంతరిక్షంలో సరికొత్త రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్‌

అలాగే ట్రంప్ అమెరికాలో ఉన్న భారతీయులపై అవలంభిస్తున్న విధాలపై మోదీ చర్చించే అవకాశాలు ఉన్నాయి. 47వ ప్రెసిడెంట్‌గా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నుంచి అనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్రంప్ గవర్నమెంట్‌తో కీలక ఒప్పందాలు మోదీ టూర్‌లో చోటుచేసుకోవచ్చిన అంచనాలు. ముంబై ఉగ్రదాడి నిందితులను త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. సోమవారం ట్రంప్‌కు మోదీ కాల్ చేసి ఆయన రెండవసారి అధ్యక్ష పీఠం అధిరోహించిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన విషయం తెలిసిందే. కాగా మోదీ అమెరికాకు వెళ్తే ట్రంప్ సెంకడ్ టర్మ్ లో ఇదే ఆయన ఫస్ట్ యూఎస్ టూర్ కానుంది.

ఇది కూడా చదవండి: Trump: అలా చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తా.. ట్రంప్ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు