Pm Modi: వార్ రూమ్ లో ప్రధాని మోదీ..ఆపరేషన్ సింధూర్ పర్యవేక్షణ

భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నంతసేపూ ఆయన వార్ రూమ్ నుండి చూస్తూనే ఉన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
pm

PM Modi

పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం కొన్ని రోజులుగా చెబుతూనే ఉంది. అన్నట్టుగానే నిన్న అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. మొత్తం తొమ్మిది స్థావరాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. దీనికి పాక్ సౌన్యం కూడా స్పందించింది. భారత దాడులు అనంతరం సరిహద్దులు వెంబడి కాల్పులు చేసింది. దీనికి భారత ఆర్మీ కూడా ధీటుగా జవాబిచ్చింది. దీంతో ఎల్వోసీ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాయు రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉంది.

వార్ రూమ్ నుంచి..

ఈ మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రాత్రంతా వార్ రూమ్ నుంచి వాచ్ చేశారు. భారత ఆర్మీకి మద్దుతుగా నిలిచారు. మరోవైపు ఉగ్రవాద శిబిరాలపై దాడుల వివరాలను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. ఆపరేషన్ సింధూర్ పై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మాట్లాడారు. ఆయనకు అన్నీ వివరించారు. 

 

today-latest-news-in-telugu | attacks | pm modi 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు