ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేటుగాళ్ల వలలో పడి చాలామంది వేలు, లక్షలు, కోట్లు పోగొట్టుకుంటున్నారు. అయితే తాజాగా పెరుగుతున్న సైబర్ నేరాలు, అలాగే అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI)తో జరుగుతున్న అక్రమాలు, డీప్‌ఫేక్ వంటి వాటిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటివల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆదివారం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో డీజీపీలు, ఐజీపీల మూడు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు.
Also Read: విహార యాత్రల పేరుతో భారీ మోసం.. రూ.15 కోట్లు టోకరా!
కానిస్టేబుళ్ల స్థాయిలోనే టెక్నాలజీ వినియోగించి వాళ్లపై పనిభారాన్ని తగ్గించాలంటూ సూచనలు చేశారు. ఈ సదస్సులో దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చలు జరిగాయి. ఆదివారం చివరి రోజు కావడంతో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, మావోయిస్టుల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి, మహిళలపై జరుగుతున్న హత్యాచారాల నియంత్రణ, జలమార్గంలో సమర్ధ బందోబస్తుకు సంబంధించి తీర్మానాలు కూడా జరిగాయి.
Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు
అయితే సైబర్ నేరాలపై మనం చేసే యుద్ధాన్ని ఓ అవకాశంగా తీసుకొని పోలీసులు పనిచేయాలని ప్రధాని మోదీ సూచనలు చేశారు. అలాగే స్మార్ట్ పోలీసింగ్‌ను కూడా అమలు చేయాలన్నారు. ఇదిలాఉండగా ఆదివారం జరిగిన 59వ సదస్సులో 250 మంది అధికారులు ప్రత్యంక్షంగా పాల్గొన్నారు. మరో 750 మంది వర్చువల్‌గా హాజరయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. ఇద్దరు హిందూ పూజారులు అరెస్టు
Also read: 6 ఇంజిన్లు, 295 బోగీలు, స్టేషన్ దాటాలంటే గంట సమయం.. మన ఇండియాలోనే!