Indian Army: 100 మందికి పైగా ఉగ్రవాదులను లేపేశాం.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

ఆపరేషన్ సిందూర్‌ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఉగ్రవాదుల అంతానికి ఆపరేషన్ సిందూర్ చేపట్టామన్నారు.

New Update

ఆపరేషన్ సిందూర్‌ గురించి త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు. '' పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబ సభ్యుల ఆవేదనను దేశం మొత్తం చూసింది. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వాళ్లకి శిక్షణ ఇచ్చిన ప్రాంతాలపై దాడులు చేశాం. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాం. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దాడుల భయంతో ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయి.

Also Read: POKని భారత్‌కు అప్పగించాల్సిందే.. మోదీ సంచలన డిమాండ్

మేము ఉగ్రవాద స్థావాలపై మాత్రమే దాడులు చేశాం. సరిహద్దుకు దగ్గర మురిద్కేలో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తొలిదాడి చేశాం. లక్ష్యాలను పక్కాగా ప్లాన్ చేసి దాడులు చేశాం.  పాకిస్థాన్ మాత్రం సామాన్యులు, ప్రార్థన స్థలాలు, పాఠశాలలను టార్గెట్ చేసింది. LOC దగ్గర ప్రతి నిబంధనను పాకిస్థాన్ ఉల్లంఘించిందని'' త్రివిధ దళాల అధిపతులు తెలిపారు. 

Also Read: సైన్యంలో చేరి నా తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా : జవాన్ కూతురు

మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్‌ది ఎప్పటికీ ఒకటే మాట అని తేల్చి చెప్పారు. POKని భారత్‌కు అప్పగించడం తప్పా.. పాకిస్తాన్‌కు వేరే గత్యంతరం లేదని మోదీ అన్నారు. త్రివిధ దళాలకు మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటు నుంచి తుపాకి తూటాలు వస్తే.. ఇటు నుంచి మిస్సైల్స్ దూసుకెళ్లాలని ఇండియన్ ఆర్మీకి మోదీ సూచించారు. పాకిస్తాన్‌ దాడులు జరిపితే ప్రతిదాడులు చేయాలని ప్రధాని చెప్పారు. ఇండియాకు ఎవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని ఆయన సష్టం చేశారు. పాకిస్తాన్ దాడులు జరిపితే.. ఇండియా కూడా దాడులు చేస్తోందని హెచ్చరించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు