PM Modi: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన ప్రధాని మోదీ.. LIVE

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్‌లో చూడండి.

New Update

 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చేందకు ఇక్కడి ప్రజలు బీజేపీకి అవకాశం కల్పించారని అన్నారు. బీజేపీ నమ్మకం పెట్టి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలంలో ఆయన ప్రసంగించారు.   

" ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విముక్తి పొందిన ఢిల్లీ ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మోదీ గ్యారంటీని దేశ రాజధాని ప్రజలు కూడా విశ్వసించారు. వాళ్లు చూపించిన ప్రేమను పెంచి అభివృద్ధి రూపంలో తిరిగిస్తాం. ఢిల్లీని అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజల రుణం తీర్చుకుంటాం. ఇక్కడ గెలిచిన అసలైన విజేతలు ప్రజలే. ఢిల్లీలో గెలిచామంటే దేశమంతటా బీజేపీని దీవించినట్లే. ఇక్కడి అభివృద్ధికి నాది గ్యారెంటీ. మెట్రో పనులు జరగకుండా ఆప్ నేతలు అడ్డుకున్నారు. అభివృద్ధికి ఎవరు అడ్డు పడుతున్నారో ప్రజలు గ్రహించి ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. మా పనితీరు చూసే అనేక రాష్ట్రాల్లో మాకు అధికారాన్ని అప్పగించారు. హర్యానాలో సుపరిపాలను అందించాం. మహారాష్ట్ర రైతులకు అండగా నిలబడ్డాం. 

Also Read: ఆప్‌ ఓటమి.. కేజ్రీవాల్‌ ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే

ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి. ఢిల్లీని మేము సరికొత్త ఆధునిక నగరంగా మారుస్తాం. ఇప్పటివరకు దోచుకున్న సంపదను కక్కిస్తాం. అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్లపై చర్యలు తీసుకుంటాం. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుసార్లు ఖాతానే తెరువలేదు. బీజేపీ ఓటు బ్యాంకు దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇండియా కూటమి కాంగ్రెస్‌ వైపు పనిచేసింది. రాష్ట్రంలో వివిధ వర్గాలను రెచ్చగొట్టమే కాంగ్రెస్ చేసే పని. 21 శతాబ్దంలో రాజకీయాల్లోకి కొత్తతరం రావాలి. వికసిత్ భారత్‌ కోసం బీజేపీలో యువతకు పెద్దపీట వేస్తాం.  

Also Read: కేసీఆర్ నుంచి కేజ్రీవాల్ వరకు.. బీజేపీ చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిన సీఎంల లిస్ట్ ఇదే!

కాంగ్రెస్ కొత్త తరాన్ని ముందుకు రాకుండా అడ్డుకుంటోంది. నేటి తరం కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. నేటితరం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది. అధికారం, సుఖం కోసం మేము రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. ప్రజలకు సేవ చేసేందుకు, వాళ్లకు అండగా ఉండేదుకే రాజకీయాల్లోకి వచ్చామని'' ప్రధాని మోదీ అన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు