BIG BREAKING: రైతుల విషయంలో తలొగ్గేదే లేదు..టారీఫ్ లపై ప్రధాని మోదీ

రైతుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని భారత ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ టారీఫ్ లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు. డెయిరీ ఉత్పత్తులను నిరాకరించిన కారణంగానే టారీఫ్ పెంపు అంటూ మోదీ వ్యాఖ్యలు చేశారు.

New Update
PM Modi

PM Modi

రైతుల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని భారత ప్రధాని మోదీ అన్నారు. ట్రంప్ టారీఫ్ లకు తలొగ్గేదే లేదని తేల్చి చెప్పారు. భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌లు పెంచడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  రైతుల సంక్షేమం విషయంలో రాజీపడేదే లేదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి చమురు దిగుమతులును సాకు చూపిస్తున్నారు.. కానీ అసలు విషయం మాత్రం అది కాదని మోదీ అన్నారు. ఇంతకు ముందు వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా అమెరికా డెయిరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని ట్రంప్ వత్తిడి తీసుకు వచ్చారు. దానిని భారత్ నిరాకరించింది.  అలా చేస్తే దేశంలోని రైతులకు నష్టం చేకూరుతుందని తేల్చిచెప్పింది. ఈక్రమంలో వచ్చి విభేదాలతోనే ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు పెంచుతున్నట్లు తెలుస్తోందని మోదీ పరోక్షంగా చెప్పుకొచ్చారు. 

WhatsApp Image 2025-08-06 at 11.37.41 PM
Modi respond

Also Read: Trump Warning: ముందుంది ముసళ్ళ పండగ..మరిన్ని సుంకాల వాయింపు అంటున్న ట్రంప్

ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..మాకు రైతుల ప్రయోజనాలే ప్రధాన ప్రాధాన్యత. రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలపై భారతదేశం ఎప్పుడూ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని నాకు తెలుసు... నేను దానికి సిద్ధంగా ఉన్నాను ప్రధాని మోదీ అన్నారు.

అన్యాయం, అసమంజసం...

అంతకు ముందు ట్రంప్ టారీఫ్ లపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్ నిర్ణయంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో పాటూ నిరాశను కూడా వ్యక్తం చేసింది. ఇదొక దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించింది. ఇతర దేశాలు కూడా తమ సొంత ప్రోజనాలను చూసుకుంటున్నాయని...కానీ తమపైనే ట్రంప్ ఈ విధంగా టారీఫ్ లు వేయడం చాలా అన్యాయమని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్షుని వాదన, నిర్ణయం రెండూ చాలా అసమంజసమైనవి అంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక రష్యా నుంచి చమురు దిగుమతిపై ఇప్పటికే తమ వైఖరిని తెలియజేశామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మార్కెట్, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడే తమ నిర్ణయాలు ఉంటాయని మరోసారి తెలిపింది. 140 కోట్లమంది దేశ ప్రజల ఇంధన భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది. 

Also Read: Stock Market: నిట్టనిలువునా కూలిపోయింది..ఎరుపెక్కిన స్టాక్ మార్కెట్

Advertisment
తాజా కథనాలు