/rtv/media/media_files/2025/08/07/trump-warning-2025-08-07-08-37-49.jpg)
Trump Warning
ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రష్యాతో చమురు వ్యాపారం మానుకోకపోతే టారీఫ్ లతో చంపేస్తా అన్న ట్రంప్ ఇప్పటికే భారత్ పై 50 శాతం సుంకాలను విధించారు. అయితే ఇక్కడితో అయిపోలేదు అని మళ్ళీ సంకేతాలిచ్చారు. భారత్ పై మరిన్ని ద్వితీయ ఆంక్షలు విధిస్తామని చెబుతున్నారు. ఇప్పటికి తాను టారీఫ్ లు అనౌన్స్ చేసి ఎనిమిది గంటలే అయింది..ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. చైనావంటి దేశాలు కూడా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నాయి అని కదా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఇంకా చాలా చూడబోతున్నారు. ద్వితీయ ఆంక్షలను కూడా చూడబోతున్నారు అని చెప్పారు.
రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే...
ఉక్రెయిన్ పై దాడులు దాదాపు మూడేళ్ళుగా యుద్ధం చేస్తున్న రష్యాతో శాంతి ఒప్పందం చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వత్తిడి తీసుకువస్తున్నారు. ఎన్ని చేసినా రష్యా లొంగడం లేదు. ఆ దేశం మీద ఎలాంటి ఆయుధాలు ప్రకటించినా...రష్యా తోసిపారేస్తోంది. దీంతో ట్రంప్ రెండో వైపు నుంచి నరుక్కురావాలని అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు రష్యా మీద వత్తిడి తీసుకువచ్చేలా చేయాలని భావిస్తున్నారు. దాని కోసం భారత్ వంటి దేశాలను ప్రెజర్ చేస్తున్నారు. ఇంతకు ముందు రష్యాకు చెప్పాలని భారత్, చైనా లాంటి దేశాలకు ట్రంప్ చెప్పారు. వినకపోవడంతో టారీఫ్ లతో దండెత్తుతున్నారు. ఇందులో భాగంగానే నిన్న ఇండియాపై 50 శాతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు.
ముందు ముందు ఇంకా ఉంటాయి..
అయితే తాజాగా అక్కడితో అయిపోలేదని ట్రంప్ మళ్ళీ హెచ్చరించారు. రష్యాతో ఆర్థిక సంబంధాలు తెంచుకునే వరకూ దేశాలపై వత్తిడి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరిగి, ఒప్పందం కుదిరితే..భారత్ పై సుంకాలు తగ్గవచ్చా అని విలేకరులు అడిగారు. దీనికి ట్రంప్ సమాధానమిస్తూ..దానిని తరువాత నిర్ణయిస్తామని చెప్పారు. మరి చైనా సంగతేంటి అని అడగ్గా..ఆ దేశంపైనా సుంకాలు విధిస్తాయని సూచించారు. ఉక్రెయిన్‌లో వివాదాన్ని ముగించడానికి రష్యాపై ఒత్తిడిని పెంచే అదనపు ఆంక్షలు మరిన్ని ఉంటాయని ఆయన అన్నారు. భారత్ లాగే మరికొన్ని దేశాలపై కూడా టారీఫ్ లు విధిస్తాము..అందులో చైనా కూడా ఉండవచ్చని ట్రంప్ తెలిపారు.
#WATCH | On being asked, 'Indian officials have said that there are other countries that are buying Russian oil, like China, for instance. Why are you singling India out for these additional sanctions', US President Donald Trump says, "It's only been 8 hours. So let's see what… pic.twitter.com/YRNbR06ne8
— ANI (@ANI) August 6, 2025
Also Read: Cloud Burst: అది క్లౌడ్ బరస్ట్ కాదేమో..ఉత్తరాఖండ్ లో వరదలపై శాస్త్రవేత్తల అనుమానం