/rtv/media/media_files/2025/11/11/haryana-2025-11-11-11-53-55.jpg)
Haryana
ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన బాంబు బ్లాస్ట్‌లో 12 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోలీసు కమిషనర్లు, సీనియర్ సూపరింటెండెంట్లు అప్రమత్తంగా ఉండాలని కూడా డీజీపీ తెలిపారు. ఢిల్లీలో సంఘటన జరగడంతో భద్రతా దృష్ట్యా డీజీపీ ఈ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా వస్తువులు కనిపించినా కూడా వెంటనే 112కు కాల్ చేయాలని తెలిపారు.
ఇది కూడా చూడండి: Delhi Blast Updates: ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితుల ఫుల్ లిస్ట్ ఇదే..!
A high alert has been sounded in Punjab. In Mohali, security checks and police patrolling are underway.#RedFortBlast#DelhiBlast#Explosion#HighAlert#Punjab#ReporterDiary | @kamaljitsandhupic.twitter.com/6djTpKEHbb
— IndiaToday (@IndiaToday) November 10, 2025
అప్రమత్తంగా ఉండాలని..
రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను, అలాగే అన్ని ప్రజా రవాణా, పార్కింగ్ ప్రాంతాలు, హోటళ్లు, ధర్మశాలలను పోలీసులు తనిఖీ చేస్తున్నారని డీజేపీ వెల్లడించారు. ఢిల్లీ సరిహద్దు జిల్లాల్లో నిఘా ఉంచాలని అన్ని జిల్లా న్యాయాధికారులను ఆదేశించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అనేక మార్గదర్శకాలతో కూడిన సలహాను జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రజలు భయపడవద్దని, నమ్మవద్దని లేదా పుకార్లు లేదా ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని కూడా సూచించారు. అలాగే రద్దీగా ఉండే లేదా సున్నితమైన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా తనిఖీల సమయంలో పోలీసులతో పూర్తిగా సహకరించాలని సూచించారు.
ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీలో హైఅలర్ట్.. భద్రతా దృష్ట్యా ఈ ఏరియాల్లో మెట్రో స్టేషన్లు, రోడ్లు క్లోజ్!
Follow Us