/rtv/media/media_files/2025/03/04/rlnYTYSsCE7fUOuZ3pqm.jpg)
PM Modi Inaugurates Wildlife Centre At Vantara
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన వంతారాను ఆయన ప్రారంభించారు. సింహాలను చూసేందుకు సఫారీ చేశారు. కెమెరాతో వాటి ఫొటోలను తీశారు. అలాగే వన్యప్రాణుల ఆస్పత్రిని కూడా ఆయన సందర్శించారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICUలతో ఉన్న పశువైద్యశాలను కూడా సందర్శించారు.
Also Read: భర్తపై విష ప్రయోగం.. ఫస్ట్ నైట్ రోజు భర్త ముందే ప్రియుడితో..
కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ వంటి అనేక విభాగాలను పరిశీలించారు. తెల్ల సింహం పిల్ల, ఆసియాటిక్ సింహం పిల్లలు, అరుదైన జాతి చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల వంటి వివిధ జాతులతో సరదాగా గడిపారు. అంతేకాదు వాటికి పాలు కూడా పట్టించారు. అలాగే అక్కడ చిరుత, ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్, హిప్పోపొటామస్, ఏనుగులు, పాములు, మొసళ్లు వంటి జంతువులను వీక్షించారు.
Watch: Prime Minister Narendra Modi inaugurated and visited Vantara, a wildlife rescue and conservation center in Gujarat, home to over 1.5 lakh rescued animals. He explored its advanced veterinary facilities, interacted with rare species, witnessed surgeries, and participated in… pic.twitter.com/XV5j8mELaz
— IANS (@ians_india) March 4, 2025
Also Read: రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏనుగుల ఆస్పత్రిని కూడా ప్రధాని మోదీ సందర్శించారు. జంతువులకు సేవ చేస్తున్న వైద్యులు, కార్మికులతో ఆయన సంభాషించారు. అయితే వంతారాలో 2000లకు పైగా జాతులు అలాగే 1.5 లక్షలకు పైగా రక్షించబడిన, అంతరించిపోతున్న జంతువులు ఉన్నాయి.
Also Read: మాజీ సీఎం కుమార్తెకు వేధింపులు.. చెప్పుతో కొట్టి.. వీడియో వైరల్ !