శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పొంగిపోర్లుతోంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ కారణంగా జలాశయం నిండు కుండలా మారింది. దీంతో శ్రీశైలం గేట్లను మరోసారి ఎత్తే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న వేళ.. ఏపీ సూపర్ గుడ్ న్యూస్ అందుతోంది. భారీ రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించాలని బీపీసీఎల్ అనుకుంటున్నట్లు సమాచారం. రూ.50 వేల కోట్ల వ్యయంతో రిఫైనరీ ఏర్పాటు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల ప్రాజెక్టు అమలుకు చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడిలో ప్రాజెక్టును రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ పరిశీలించారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పూజా కార్యక్రమాల తర్వాత ఒక ప్రాజెక్టులో మోటారును స్విచ్ఆన్ చేసి ప్రాజెక్టును స్టార్ట్ చేస్తారు.