/rtv/media/media_files/2025/08/28/crude-oil-2025-08-28-21-29-16.jpg)
India Ramps Up Russian Oil Imports by 10-20% in September Despite US Tariff Pressure
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. గతంలో 25 శాతం సుంకాలు విధించగా.. ఆ తర్వాత అదనంగా దాన్ని మరో 25 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసుకొని ప్రయోజనాలు పొందుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 27 నుంచి అదనపు టారిఫ్ అమల్లోకి రావడంతో భారత్‌పై అమెరికా టారిఫ్ 50 శాతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సంచలన అప్‌డేట్ వచ్చింది.
Also Read: రిటైల్ స్టోర్లలో మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారా ? ఇకనుంచి అలా చెల్లదు !
రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతులు మరింత పెంచాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు 3 లక్షల బ్యారెల్స్‌ను అదనంగా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం భారత్.. రష్యా నుంచి 40 శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం రష్యా ఒక బ్యారెల్‌కు 2-3 డాలర్ల డిస్కౌంట్ కూడా ఇస్తోంది. అమెరికా టారిఫ్‌లు భారత్‌పై 50 శాతం అమల్లోకి వచ్చిన వేళ.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా భారత్‌పై విమర్శలు చేస్తున్నప్పటికీ.. భారత్ కూడా కౌంటర్ ఇస్తోంది. అమెరికా, యురోపియన్ యూనియన్లు కూడా రష్యా నుంచి చాలా దిగుమతులు చేసుకుంటున్నాయని విమర్శిస్తోంది.
Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 598 డ్రోన్లతో కాల్పులు
#BREAKING
— Nabila Jamal (@nabilajamal_) August 28, 2025
India plans to ramp up Russian oil imports by 10–20% in September..adding up to 300,000 barrels a day
Comes right after US raised tariffs on Indian goods to 50% over Moscow oil trade
Russia now supplies 40% of India’s crude, with fresh discounts of $2–3 a barrel… pic.twitter.com/sP9f6Ag6nP