Super Cabinet: యుద్ధం మొదలైనట్టే..మరికాసేపట్లో సూపర్ క్యాబినెట్ భేటీ

యుద్ధం ఇవాళో , రేపో మొదలయ్యే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. నిన్న త్రివిధ దళాలకు ఫుల్ పవర్స్ ఇచ్చేసిన ప్రధాని ఈరోజు సూపర్ క్యాబినెట్ భేటీలో పాల్గొననున్నారు. పుల్వామా తరువాత ఈ క్యాబినెట్ ఇప్పుడు సమావేశం అవుతోంది. 

New Update
india

Super Cabinet

దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకొనే క్యాబినెట్ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. దాంతో పాటూ ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ కూడా జరగనుంది. ఇవన్నీ చూస్తుంటే భారత యుద్ధానికి సమాయత్తమవుతోందని తెలుస్తోంది. ఈరోజో, రేపూ పాకిస్తాన్ పై పడిపోవడం గ్యారంటీ ని సమాచారం. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనకు ఎలా అయినా తగిన సమాధానం ఇచ్చే తీరాలని పట్టుబట్టకుని కూర్చొంది. 

ఏంటీ సూపర్ క్యాబినెట్..

సీసీపీఏ అనేది అత్యంత శక్తివంతమైన గ్రూప్‌. దానిని సూపర్ క్యాబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇది సమావేశం అయింది. మళ్ళీ ఇప్పుడే అవుతోంది. పుల్వామా దాడి తరువాత కూడా పాకిస్తాన్ పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశానికి ఉన్న అత్యంత అనుకూల వాణిజ్య దేశం హోదాను రద్దు చేసింది. ఇది జరిగిన మరికొద్ది రోజులకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ లోని ఉగ్రవాది శిబిరాలపై దాడి చేసి వారిని మట్టుబెట్టింది. ఈ నిర్ణయాలన్నీ అప్పుడు కూడా సూపర్ క్యాబినెట్ లోనే తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది సమావేశం అవుతుండడంతో భారత, పాక్ యుద్ధం తప్పదని అంటున్నారు. దానికి తోడు పాకిస్తాన్ కూడా భారత్ ఒకటి, రెండు రోజుల్లో తమపై విరుచుకుపడుతుందని చెబుతోంది. 

 today-latest-news-in-telugu | pm-modi | cabinet | pakistan

Also Read: Pahalgam Attack: పహల్గామ్ దాడికి ముందు సోషల్ మీడియాలో ఉగ్రవాదుల పోస్ట్ లు...తుపాకీ కావాలంటూ..

Advertisment
తాజా కథనాలు