Maoist: మావోయిస్టులను అంతం చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. రంగంలోకి లక్ష మంది బలగాలు!

మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ పోరాటంలో సంపూర్ణ విజయం సాధించే దశకు చేరుకుంది. గత ప్రభుత్వాలు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేస్తోంది.

New Update
modi mao

PM Modi and BJP operation success against Maoist movement

Maoist: మావోయిస్టులపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా దండకారణ్యాన్ని స్వాధీనం చేసుకుంటోంది.  అయితే భారత ప్రభుత్వాలు నక్సలిజంపై చేస్తున్న పోరాటం ఇది కొత్తదేం కాదు. దశాబ్దాలుగా దేశంలోని చాలా ప్రాంతాలు మావోయిస్టుల ఆధీనంలో ఉన్నాయి. వేలాది మంది అమాయక పౌరులు, భద్రతా సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ల్యాండ్‌మైన్‌లు, ఆకస్మిక దాడులు, మావోయిస్టుల హత్యలకు బలైపోతున్నారు. ప్రభుత్వాలన్నీ వామపక్ష తీవ్రవాదం (LWE)ను తీవ్రమైన అంతర్గత ముప్పుగా గుర్తించాయి. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టుల నామరూపాల్లేకుండా చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తూ విజయం దిశగా దూసుకెళ్తోంది. 

'ఆపరేషన్ గ్రీన్ హంట్‌' అంతంతమాత్రమే..

2004 నుండి 2014 వరకు అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్ సమస్య తీవ్రతను గుర్తించింది. దీంతో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ (IAP), 'ఆపరేషన్ గ్రీన్ హంట్‌'ను ప్రారంభించింది. కానీ అవి కొంతమేరకే సక్సెస్ అయ్యాయి. సరైన దిశలో అడుగులు వేసినప్పటికీ అమలులో తడబడటంతో ఆపరేషన్ అనుకున్నంత నక్సల్స్ ను అంతం చేయలేకపోయింది. కానీ 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం రక్షణాత్మక, ప్రతిచర్యాత్మక వైఖరిని అవలంభిస్తోంది. సామాజిక-ఆర్థిక కార్యక్రమాలను కంటకనిపెడుతూనే.. ఈ పోరాటంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ అనుకున్న విజయాన్ని సాధిస్తోంది. కేంద్ర దళాలు, రాష్ట్ర విభాగాల మధ్య సమన్వయంతో నక్సల్ ఉద్యమాన్ని అణచివేస్తోంది. తూర్పు, మధ్య భారతదేశంలోని విస్తారమైన అటవీ ప్రాంతాలలో పట్టు సాధించిన మవోయిస్టులపై అధిపత్యం చెలాయిస్తోంది. 

లొంగిపోవడమే ఏకైక మార్గం.. 

మావోయిస్టులు చర్చల ప్రతిపాదన చేసినప్పటికీ ఆయుధాలు అప్పగించి లోంగిపోవాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు. నక్సల్స్ జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్న ప్రభుత్వం.. హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో 'ఆపరేషన్ ప్రహార్', 'ఆపరేషన్ ఆక్టోపస్' తాజాగా 'ఆపరేషన్ కగార్' వంటి పేర్లతో మావోయిస్టులను అణచివేస్తోంది. గ్రౌండ్-లెవల్ లో బలగాల నిఘా, డ్రోన్ ద్వారా మరోవైపు సెర్చింగ్ చేస్తూ మావోయిస్టుల స్థావరాలను కూల్చివేస్తున్నారు. 

ఆదివాసులకు విముక్తి..

ఈ పోరాటం కేవలం తుపాకులు పట్టుకున్నవారి కోసమే కాదు. అభివృద్ధిపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY),  భారత్‌మాల పరియోజన.. వంటి పథకాల ద్వారా నక్సల్స్ చేత దోపిడీకి గురైన మారుమూల గిరిజన ప్రాంతాలు ఇప్పుడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడుతున్నాయి. రోడ్లు, మార్కెట్లు, పాఠశాలలను వారికి అందించడమే కాకుండా జవాబుదారీతనం, పరిపాలన, చట్టాలపై అవగాహన కల్పిస్తోంది. ప్రభుత్వ పునరావాస విధానం కూడా సక్సెస్ అయింది. వందలాది మంది మాజీ నక్సల్స్ ఉద్యోగ భరోసా, ఆర్థిక ప్రోత్సాహకాలు, సాధారణ జీవితంకోసం లొంగిపోయారు.

తగ్గిన నక్సల్స్ హింస..

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఇప్పుడు నక్సల్స్ హింస 77% తగ్గింది. పౌరులు, భద్రతా దళాల మరణాలు 85% తగ్గాయి. చాలా కుటుంబాలు హింస, గాయాలనుంచి బయటపడ్డాయి. భూమిని తిరిగి పొందాయి. ఇదంతా మోదీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది. 'ఆపరేషన్ కగార్' పేరుతో నక్సల్స్ బలమైన కోటలను బద్దలు కొట్టేందుకు లక్ష మందికి పైగా పారామిలిటరీ సిబ్బందిని మోహరించగా అనుకున్న ప్లాన్ ప్రకారం 2026 మార్చి వరకూ వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు