/rtv/media/media_files/2025/04/18/8goRZJb4AUz8k4mo2Ryv.jpg)
PM Modi AC Yojana
PM Modi AC Yojana: ఎండలకు అల్లాడిపోతున్న జనాలకు మోదీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశ్యం విద్యుత్ ఆదా చేయడమే కాగా ఈ స్కీమ్‌లో ఏసీ కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు.
ఏడాదికి రూ. 6,300 కరెంట్ బిల్లు..
ఈ మేరకు 2025 పీఎం మోదీ ఏసీ యోజన స్కీమ్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుండగా.. ఈ స్కీమ్ ను విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) నిర్వహించనుంది. విద్యుత్ ఆదా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కాగా BEE ప్రకారం పాత ACని 5 స్టార్- రేటెడ్ మోడల్‌తో రీప్లేస్ చేసుకోవడం వల్ల ఒక ఇంటికి ఏడాదికి రూ. 6,300 వరకు కరెంట్ బిల్లు సేవ్ చేయొచ్చు. ఇది ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు పవర్ గ్రిడ్‌పై కూడా ఒత్తిడి లేకుండా చేస్తుంది. పీఎం మోదీ ఏసీ యోజన కింద పాత AC స్థానంలో 5 స్టార్ రేటెడ్ ఏసీని రీప్లేస్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు ఈ స్కీమ్ కింద ఏసీ కొంటే భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇక కొత్త ఏసీ ద్వారా కరెంట్ వినియోగంతోపాటు బిల్ కూడా తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
5 స్టార్ ఏసీ ఎలా పొందాలంటే..
కరెంట్ ఎక్కువగా వినియోగించే ACని రీసైక్లింగ్ కేంద్రంలో ఇవ్వాలి. మీకు వారు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో మీకు కొత్త ఏసీపై డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త ఏసీ కొనుగోలు చేసే కస్టమర్లకు LG, వోల్టాస్, బ్లూ స్టార్, వంటి కంపెనీలు పాత ACకి బదులు డిస్కౌంట్ ఇస్తాయి. ఓల్డ్ ఏసీని రిప్లేస్ చేసిన వారికి కరెంట్ బిల్లులో తగ్గింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 2023- 24 నాటికి 1.1 కోట్ల ACలు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాంగానే కరెంట్ వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
telugu-news | today telugu news