Rashmika Mandanna: విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‌ను ఉద్దేశించి నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంతో గొప్ప విషయం అని నాకు తెలుసు’’ అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

New Update
Rashmika Mandanna (1)

Rashmika Mandanna

Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఒక మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా విజయ్‌కు మంచి కంబ్యాక్ ఇవ్వలేదు. ఈ సారి ఎలా అయినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్‌’ మూవీ చేశాడు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పరచుకుంది. 

Also Read:బడా మోసం.. హీరో ‘పవర్‌స్టార్’ను అరెస్టు చేసిన పోలీసులు

అందులోనూ వరుస అప్డేట్‌లతో మేకర్స్ సినిమా పై అంచనాలను పెంచేశారు. పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అప్డేట్‌ను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చేశారు. మొత్తంగా అందరి ఎదురుచూపులకు ఇవాళ తెరపడింది. ఎన్నో అంచనాల నడుమ ‘కింగ్డమ్’ మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. 

బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఆదరణ లభిస్తోంది. ఎంతో కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూసిన విజయ్ దేవరకొండకు ‘కింగ్డమ్’ కింగ్ లాంటి సూపర్ హిట్‌ను అందించింది. ఈ క్రమంలో ఈ మూవీకి అద్భుతమైన ఆదరణ లభించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

Also Read:‘కింగ్డమ్’ మూవీ హిట్టా? ఫట్టా?.. అదిరిపోయిన రివ్యూ

మనం కొట్టినాం

అదే సమయంలో విజయ్ దేవరకొండ మంచి కంబ్యాక్ అందుకున్నాడని సినీ ప్రియులు, అభిమానులు సంబరపడుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక ఆసక్తికర పోస్టు పెట్టారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఈ సక్సెస్ నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంతో గొప్ప విషయం అని నాకు తెలుసు. మనం కొట్టినం’’ అంటూ తన ట్వీట్‌లో రష్మిక రాసుకొచ్చారు. 

అంతక ముందు ఈ మూవీకి బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ రావడంతో విజయ్ స్పందించాడు. ఈ మేరకు తన అభిమానులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ‘‘నాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోగలిగితే బాగుండు.. నాతో పాటు మీరందరూ దీన్ని అనుభవించగలిగితే బాగుండు.. ఆ వెంకన్న స్వామి దయ, మీ అందరి ప్రేమ, ఇంకా ఏం కావాలి నా లాంటి ఒక్కడికి’’ అంటూ పోస్టు పెట్టాడు. 

Advertisment
తాజా కథనాలు