Trump Exit: ట్రంప్ రాజీనామా...వైట్ హౌస్ ప్రకటన..హోరెత్తుతున్న సోషల్ మీడియా

అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యంపై తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025లోనే ట్రంప్ రాజీనామా చేస్తారంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వైట్ హౌస్ ఈ రోజు అదే అనౌన్స్ చేయబోతోందని పోస్ట్ లు పెడుతున్నారు.

New Update
Trump

Trump

ఈరోజు ఓ ముఖ్యమైన ప్రకటన చేస్తామని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఏ విషయం గురించో మాత్రం ఏం చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో తెగ ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దాని గురించే వైట్ హౌస్ ఈ రోజు ప్రకటించనుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ముఖ్యంగా రిపబ్లికన్ ఆపోజిట్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ, దానిని సపోర్ట్ చేసేవారు ఎక్కువగా ఈ పోస్ట్ లను పెడుతున్నారు. 

Also Read: Afghanistan: రెండు రోజులైనా అవ్వలేదు..ఆఫ్ఘనిస్థాన్ లో మళ్ళీ భూకంపం

అయ్యో ఇలా మారిపోయారేంటీ...

ప్రస్తుతం ట్రంప్ ను చూస్తే ఎవరూ గుర్తుపట్టలేరని చెబుతున్నారు. ఆయన తల మీద జుట్టు దాదాపుగా ఊడిపోయిందని... బట్టతల క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ఆయన చేతి మీద ఉన్న నల్ల మచ్చ మరింత పెద్దదిగా కూడా కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అసలే ట్రంప్(Donald Trump) చాలా రోజులుగా కనిపించడం లేదని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్స్ అవుతున్నాయి. ఆయనకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని..ఆయన మరణించారని కూడా కొంత మంది పుకార్లు సృష్టించారు. ఇప్పుడు బయటకు వచ్చిన పిక్స్ చూసి కచ్చితంగా ట్రంప్ కు ఏదో అయిందని అంటున్నారు. కానీ ఇంత తొందరగా ఆయనలో మార్పు ఎలా వచ్చిందని...రెండు రోజుల్లోనే అంతలా ఎలా మారిపోయారని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరుగుతోందో చెప్పాలని అడుగుతున్నారు.  అమెరికా అధ్యక్షుడికి వైద్య చికిత్స జరుగుతోందని...దానివల్లనే ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. తీవ్రమైన గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి రోగాలకు చేసే చికిత్సకే ఇలా జరుగుతుందని చెబుతున్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీని మీద ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరోవైపు ట్రంప్ కూడా ఈ పుకార్ల మీద ఏమీ మాట్లాడటం లేదు. కనీసం వాటిని ఖండించడం కూడా లేదు. 

Also Read: Pak PM Shehbaz : మాకు కూడా అదే కావాలి..ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్

Advertisment
తాజా కథనాలు