BJP: ఎగ్జిట్‌ పోల్స్‌.. ఝార్ఖండ్‌ గడ్డపై బీజేపీదే అధికారం

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. 'పీపుల్‌ పల్స్ పోల్‌' సర్వే.. ఝార్ఖండ్‌లో ఈసారి బీజేపీ గెలుస్తుందని వెల్లడించింది. బీజేపీకి 42-48, జేఎంఎం 16-23, కాంగ్రెస్ 8-14, ఏజేఎస్‌యూ 2-5, ఇతరులు 6-10 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

New Update
పపప

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ప్రముఖ పోల్‌ సర్వే పీపుల్‌ పల్స్.. ఝార్ఖండ్‌లో ఈసారి బీజేపీ గెలుస్తుందని వెల్లడించింది. బీజేపీకి 42-48, జేఎంఎం 16-23, కాంగ్రెస్ 8-14, ఏజేఎస్‌యూ 2-5, ఇతరులు 6-10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే.. బీజేపీకి 42.1 శాతం, జేఎంఎంకు 20.8 శాతం, కాంగ్రెస్ 16.3 శాతం, ఏజెఎస్‌యూ 4.6 శాతం, ఇతరులు 16.3 శాతం వస్తుందని అంచనా వేసింది. మొత్తం 82 (81+1 నామినేటెడ్‌ స్థానం) అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 41 సీట్లు సాధించాలి. పీపుల్ పల్స్‌ సర్వేను బట్టి చూస్తే బీజేపీ క్లీన్ స్వీప్‌ చేసి అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

రర

Also Read: శృంగారం కోసం 300 కి.మీ ప్రయాణించిన పులి.. సహచరి ఎక్కడ దొరికిందంటే! vot

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

ఇక మాట్రైజ్ అనే మరో పోల్‌ సర్వే.. ఎన్డీయేకు 27 -42 అసెంబ్లీ సీట్లు వస్తాయని.. ఇండియా కూటమికి 25 -30 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక జేవీసీ అనే మరో సర్వే.. ఎన్డీయే కూటమికి 40-44, ఇండియా కూటమికి 30-40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

చాణక్య

ఎన్డీయే: 46-58
ఇండియా: 24-37
ఇతరులు - 6-10

జన్‌లోక్‌పాల్

ఎన్టీయే: 39-43
ఇండియా: 37-41
ఇతరులు: 6-8

పీ మార్క్

ఎన్డీయే: 31-40
ఇండియా: 37-47
ఇతరులు: 01-06

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు