వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు! వరంగల్‌లో అఘోరీ కలకలం సృష్టించింది. నిన్నటి నుంచి రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలో శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రి సమయంలో శ్మశానంలోనే పూజలు చేసింది. అఘోరీని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున శ్మశానానికి చేరుకున్నారు. By Seetha Ram 20 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇటీవల అఘోరీ ఏపీలోని మంగళగిరిలో రచ్చ రచ్చ చేసింది. ఆంధ్రపదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాతే వెళతానంటూ పట్టుబట్టి హైవేపై బైఠాయించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అది అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ తెలంగాణకు చేరుకుంది. Also Read: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్ స్మశానంలో అఘోరి పూజలు తాజాగా వరంగల్‌లో అఘోరీ ప్రత్యక్షమైంది. నిన్నటి నుంచి రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చుంది. రాత్రంతా శ్మశాన వాటికలోనే ఉన్న అఘోరి.. అక్కడే శ్మశానంలోనే పూజలు చేసింది. Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి అనంతరం శ్మశానంలో పడుకుంది. ఇకపోతే అఘోరి మగవారితో మాట్లాడకుండా ఐదు రోజుల దీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లనే కేవలం మహిళలతోనే ఆమె మాట్లాడుతుంది. మహిళలకు మాత్రమే భస్మంతో బొట్టు పెడుతుంది. అనారోగ్య సమస్యలున్న పలువురు భక్తులు అఘోరీ వద్ద మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఘోరీని చూడటానికి శ్మశానానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. మంగళగిరిలో రచ్చ రచ్చ Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా కాగా లేడీ అఘోరీ ఇటీవల ఏపీలోని మంగళగిరిలో రచ్చ రచ్చ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే అక్కడ నుంచి వెళ్తానంటూ రోడ్డుపైనే కూర్చుంది. ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసులపై రెచ్చిపోయింది. రోడ్డుపై నుంచి ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపైనే చేయిచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రోడ్డు పై నుంచి లేవకపోవడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. రహదారి పొడువునా వాహనాలు స్థంబించిపోయాయి. Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు? దీంతో ఆమెను పైకి లేపే క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా పోలీసులపైనే చేయి చేసుకుంది. పోలీసు వాహనంలో ఎక్కమని చెబితే.. ఆ వాహనం డోరునే గట్టిగా వేసింది. ఆపై పోలీసులపై తిరగబడింది. ఏకంగా కానిస్టేబుల్ తలపై కొట్టింది. ఆ వీడియోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇక లాభంలేదని భావించిన పోలీసులు సహనం విడిచి అఘోరిని ఒక పెద్ద డీసీఎంలో ఎక్కించారు. #aghori మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి