/rtv/media/media_files/2025/12/24/pentagon-reveals-china-helped-pakistan-during-operation-sindoor-2025-12-24-20-11-59.jpg)
Pentagon reveals China helped pakistan during operation sindoor
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను మన సైన్యం ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగిన ఏడు నెలల తర్వాత ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన పెంటగాన్ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సాయం చేసిందని వెల్లడించింది. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాక్ ద్వారా భారత్‌ను బలహీనపర్చేందుకు గ్రేజోన్ వ్యూహాన్ని అనుసరించినట్లు పేర్కొంది.
నివేదికలో తెలిపిన వివరాలు ప్రకారం.. చైనా పాకిస్థాన్‌కు మూడు విధాలుగా సాయం చేసింది.
1. నిఘా మద్దతు
చైనా తన శాటిలైట్, ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా పాకిస్థాన్‌ను భారత్‌కు సంబంధించి రియల్‌టైమ్ పర్యవేక్షణను అందించింది. దీనివల్ల పాక్ కార్యకలాపాలు భారత్‌పై లక్ష్యం చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికి వీలు కలిగింది.
2. సమాచార వ్యాప్తి
భారత్ ఆపరేషన్ సిందూర్‌పై చేసిన ఆరోపణలను ఖండించడానికి పాకిస్థాన్ కథనాన్ని అంతర్జాతీయంగా వ్యాప్తి చేసేందుకు చైనా ఆన్‌లైన్ ప్రచారాలు ప్రారంభించింది.
3.సైబర్ కార్యకలాపాలు
పాకిస్థాన్‌పై సైబర్ దాడులు, దౌత్యపరమైన సంఘర్షణలు పెరగకుండా నిరోధించాయి. కానీ భారత్‌పై ఒత్తిడిని కొనసాగించాయి. పాకిస్థాన్‌కు సాయం చేసేందుకు చైనా నేరుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని (PLA)ని మోహరించలేదు. కానీ వెనుక నుంచి మాత్రం సపోర్ట్ ఇచ్చింది.
Also read: పీల్చే గాలిలో కూడా ‘మైక్రోప్లాస్టిక్స్’.. వెలుగులోకి సంచలన నిజాలు
చైనా ఈ వ్యూహాన్ని ఎందుకు అనుసరించింది ?
పెంటగాన్ రిపోర్టు ప్రకారం.. భారత్ అమెరికాతో రక్షణ సహకరాన్ని పెంచకుండా నిరోధించడమే చైనా ప్లాన్. ఇందుకోసం పాకిస్థాన్‌ను తమ అవసరాలకు వాడుకుంటోంది. ఆపరేషన్ సిందూర్‌ను చైనా తమ గ్రేజోన్ వ్యూహానికి పరీక్ష కేసుగా భావించింది. 2024లో అక్టోబర్‌లో LAC వద్ద భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందం కూడా తాత్కాలికమేనని తేలింది. భారత్ అమెరికాకు దగ్గరవ్వకుండా నిరోధించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు నివేదిక తెలిపింది. దీంతో భారత్ ఇప్పుడు పాక్‌తో మాత్రమే కాకుండా చైనా నుంచి వచ్చే ముప్పుకు కూడా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అణు దేశాలైన చైనా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు సవాళ్లుగా ఉన్నాయని తెలిపారు. అందుకే సుధీర్ఘ యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Follow Us