/rtv/media/media_files/2025/12/24/china-2025-12-24-21-04-27.jpg)
Pentagon report to US Congress flags China’s core interest claim on Arunachal Pradesh
భారత్‌కు చెందిన అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనాకు ఎప్పటినుంచో కన్నుపడింది. ఇప్పటికే కొంత భూభాగన్ని కూడా చైనా ఆక్రమించినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి అమెరికాకు చెందిన పెంటగాన్ కీలక విషయాలు వెల్లడించింది. తాము రాజీపడని అంశాల్లో అరుణాచల్‌ప్రదేశ్ ఒకటని చైనా భావిస్తోందని పేర్కొంది. 2049 నాటికి తాము అనుకున్న టార్గెట్‌ను చేరుకోవాలని చైనా భావిస్తున్నట్లు తెలిపింది. తైవాన్, సెంకాకు ద్వీపాలతో సహా భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ అనేవి చైనా జాతీయ భద్రతా ప్లాన్లలో భాగం అయినట్లు స్పష్టం చేసింది.
Also Read: ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా ఎలా సాయం చేసిందో తెలుసా ? షాకింగ్ రిపోర్టు విడుదల
జాతీయ పునరుజ్జీవంలో భాగంగా తైవాన్ లాంటి కీలక భూభాగాలను చేర్చుకోవడం ముఖ్యమని చైనా భావిస్తున్నట్లు పెంటగాన్ రోపోర్టు చెప్పింది. ఇందులో మూడు ప్రధాన ప్రయోజనాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు పేర్కొంది. ఒకటి చైనా కమ్యూనిస్ట్ పార్టీపై నియంత్రణ, రెండోది దేశ ఆర్థికాభివృద్ధి కాగా, మూడోది సార్వభౌమధికారం, ప్రాదేశిక వాదనలు కొనసాగించడం లాంటి అంశాలు ఉన్నట్లు తెలిపింది. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ (CCP) తమ పాలనకు దేశం బయట, లోపల నుంచి వచ్చే విమర్శలతో ఎదురయ్యే ముప్పు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటున్నట్లు పేర్కొంది. అంతేకాదు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉండే రాజకీయ నాయకులు, పార్టీలు బయటిదేశాల శక్తులకు ప్రభావితమైన వేర్పాటువాదులుగా ముద్ర వేసినట్లు తెలిపింది.
Also Read: పీల్చే గాలిలో కూడా ‘మైక్రోప్లాస్టిక్స్’.. వెలుగులోకి సంచలన నిజాలు
LAC వెంబటి కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగిసేలా భారత్-చైనా మధ్య కుదిరిన గస్తీ ఒప్పందం గురించి కూడా పెంటగాన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గతేడాది బ్రిక్స్ శిఖరాగ్ర మీటింగ్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత్ ప్రధాని మోదీ మధ్య జరిగిన సమావేశం ఇరుదేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరణ చేసేందుకు దారి చూపిందని పేర్కొంది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం కోసం LAC వెంబడి తగ్గిన ఉద్రిక్తతలను వినియోగించుకోవాలని చైనా యోచిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలపడకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటోందని పెంటగాన్ చెప్పింది.
Follow Us