/rtv/media/media_files/2025/01/28/3wP3fBGToRQxw97f3BY9.jpg)
Parliament Session
జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు రెండు విడుతల్లో జరగనున్నాయి. తొలి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడుత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఇక ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగం జరిగిన అరగంట తర్వాత రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Also Read: భారత జాలర్లపై శ్రీలంక నేవీ కాల్పులు.. తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ
అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు అంటే జనవరి 30న కేంద్రం అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కిరణ్ రిజిజు పేర్కొన్నారు. సభల్లో సమావేశాలు సజావుగా నిర్వహించడం కోసం విపక్ష నేతలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన సమావేశాలను గుర్తుచేశారు. రెండు సెషన్లలో పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం నెలకొందని, దీనివల్ల పార్లమెంట్ ప్రతిష్ట దెబ్బతిందని తెలిపారు.
Also Read: కుంభమేళా కంటే లండన్ వెళ్లడమే చీప్.. ఆకాశాన్నంటుతున్న ఫ్లైట్ టికెట్ ధరలు!
రాబోయే సమావేశాల్లో విపక్ష పార్టీలు సహకరిస్తేనే పార్లమెంట్ పనిచేయడంతో చర్చలు సజావుగా సాగుతాయని తెలిపారు. అలాగే ఈారి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ బాగుంటుందని అందరూ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!