IND-PAK WAR : భారతదేశం, పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందంపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా అనేక అంశాలను లేవనెత్తారు. కాల్పుల విరమణ ఉన్నా.. లేకున్నా పహల్గాంలో అమాయక టూరిస్టులను చంపిన పాకిస్థాన్ ఉగ్రవాదులను శిక్షించి తీరాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే మన ప్రధాని మోదీ కాల్పుల విమరణ ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు. 1972 నుంచి మన వ్యవహారాల్లో మూడో పక్ష జోక్యాన్ని నిరాకరిస్తున్నాం. ఇప్పుడెందుకు అంగీకరించారు. పాక్ ఉగ్రవాదానికి సపోర్టు చేయదని యూఎస్ హామీ ఇస్తుందా? పాక్ ఉగ్రవాద దాడులు చేయకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించామా అంటూ నిలదీశారు.
పాకిస్థాన్ తన భూభాగాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదానికి అనుకూలంగా ఉపయోగిస్తున్నంతకాలం శాశ్వత శాంతి సాధ్యం కాదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. పాక్ తన భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించదని అమెరికా హామీ ఇస్తుందా? భవిష్యత్తులో ఉగ్రదాడులు చేయకుండా నిరోధించడంలో మనం మన లక్ష్యాన్ని సాధించామా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు
కాగా శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొ్న్న అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్ పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్లోని హిందూ, ముస్లింల మధ్య ఘర్షణను పాక్ కోరుకుంటుందని, దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తుందని ఒవైసీ అన్నారు. భారత్‌లో 23 కోట్ల మందికిపైగా ముస్లింలు ఉంటున్నారని వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవిస్తున్నారన్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు
ఇస్లాం పేరుతో పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ధ్వజమెత్తారు. ద్విజాతి సిద్ధాంతాన్ని తమ పూర్వీకులు తిరస్కరించారని గుర్తు చేశారు. ద్విజాతి సిద్ధాంతంపై ఏర్పడిన పాక్, ఆఫ్ఘాన్పై ఎందుకు దాడి చేస్తోందని ప్రశ్నించారు. ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ ఎందుకు బాంబులు వేస్తోందని అన్నారు. ఆఫ్ఘన్లు, ఇరానియన్లు ముస్లింలు కాదా? అని ప్రశ్నించారు. పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అత్యంత అనాగరికమైన చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్న ఆయన, దేశంలోని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని అసదుద్దీన్ స్పష్టంచేశారు.
ఇది కూడా చూడండి: IND-PAK WAR: వార్ ఎఫెక్ట్.. Deloitte, HCL, టెక్ మహీంద్రాతో పాటు WFH ప్రకటించిన కంపెనీల లిస్ట్ ఇదే!