Pakistani Air Base: భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్

గతేడాది మేలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సంక్షిప్త యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. కేవలం గంటల వ్యవధిలో పాకిస్థాన్‌ను భారత్ కోలుకోలేని దెబ్బ తీసి, కాళ్ల బేరానికి తెచ్చిన వైనంపై ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు.

New Update
Bholari Hangar

గతేడాది మే నెలలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సంక్షిప్త యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. కేవలం 88 గంటల వ్యవధిలో పాకిస్థాన్‌ను భారత్ కోలుకోలేని దెబ్బ తీసి, కాళ్ల బేరానికి తెచ్చిన వైనంపై ఇప్పుడు రక్షణ రంగ నిపుణులు విశ్లేషణలు చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'(operation sindhoor) పాక్ సైనిక సామర్థ్యాన్ని కుంగదీసింది. యుద్ధం ముగిసి నెలలు గడుస్తున్నా, పాకిస్థాన్ ఇప్పటికీ ఆ నష్టం నుండి కోలుకోలేకపోయింది. ధ్వంసమైన ఎయిర్‌బేస్‌ల మరమ్మతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భోలారి బేస్‌(Bholari Hangar Roof) లో జరిగిన విధ్వంసం(Pakistani Air Base Destroyed) పాక్ గగనతల రక్షణ వ్యవస్థకు తీరని లోటుగా మారింది. భారత వాయుసేన చూపిన తెగువ, సాంకేతిక నైపుణ్యం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.

Also Read :  జెఫ్రీ ఎప్‌స్టీన్ వింత ప్రయోగాలు.. వందల మంది పిల్లల్ని పుట్టించాలని ల్యాబ్

Pakistani Air Base Destroyed In Operation Sindhoor

పహల్గామ్‌లో జరిగిన పిరికిపంద దాడికి స్పందనగా భారత సైన్యం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. మొదట పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని లష్కరే తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అయితే, పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడటంతో భారత్ తన వ్యూహాన్ని మార్చి, నేరుగా శత్రుదేశ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేటెస్ట్ యుద్ధ విమానాలతో పాకిస్థాన్‌లోని కనీసం 10 ప్రధాన ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది. - Indian Air Force

పాక్ సైనిక ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్న నూర్ ఖాన్ (రావల్పిండి) బేస్‌పై దాడి చేయడం భారత్ సాధించిన వ్యూహాత్మక విజయం. మే 10న జరిగిన ఈ దాడిలో పాక్‌కు చెందిన అత్యంత ఖరీదైన SAAB 2000 ‘Erieye’ (ఎర్లీ వార్నింగ్ విమానం) ధ్వంసమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ చిత్రాలు ఇక్కడి హ్యాంగర్ పైకప్పును పాక్ పునర్నిర్మిస్తున్నట్లు ధ్రువీకరిస్తున్నాయి. మురీడ్, సుక్కూర్, చక్లాలా, రఫికీ, రహీం యార్ ఖాన్, నయాచోర్ వంటి కీలక స్థావరాలు భారత క్షిపణుల దాటికి చిధ్రమయ్యాయి.

ఈ దాడుల్లో భారత్ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది.
రాఫెల్: శత్రువుకు చిక్కకుండా స్కాల్ప్ క్షిపణులతో దాడులు చేసింది.
సుఖోయ్-30 MKI: ఇజ్రాయెల్ తయారీ రాంపేజ్ మరియు స్వదేశీ బ్రహ్మోస్ ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులతో లక్ష్యాలను ఛేదించింది.
మిరేజ్-2000: క్రిస్టల్ మేజ్ క్షిపణులను ఉపయోగించి పాక్ రక్షణ కవచాలను తుత్తునియలు చేసింది.

Also Read :  అనిల్‌ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్‌.. వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
తాజా కథనాలు