/rtv/media/media_files/2025/05/01/6Gd2R1i5MnUv1VUNlqLg.jpg)
Attari-Wagah Border
పహల్గామ్ దాడి తరువాత పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసింది భారత ప్రభుత్వం ఏప్రిల్ 30లోపు వాళ్ళందరూ దేశం విడిచి వెళ్ళాలని చెప్పింది. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా ఇవాళ డెడ్ లైన్.. దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో చాలా మంది పాక్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోయారు. ఏప్రిల్ 24 మరియు 27 మధ్య మొత్తం 537 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా పాకిస్తాన్‌కు చేరుకున్నారని, 850 మంది భారతీయులు పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చారని చెప్పారు. ఏప్రిల్ 26న 81 మంది, ఏప్రిల్ 25న 191 మంది, ఏప్రిల్ 24న 28 మంది బయలుదేరారని అధికారులు తెలిపారు.
వెసులుబాటు..తదుపరి ఆదేశాల వరకు..
భారత ప్రభుత్వం విధించిన గడువు నిన్నటితో ముగిసింది. అయినా కూడా ఇంకా చాలా మంది పాకిస్తానీయులు ఇక్కడే ఉండిపోయారు. వీరందరూ భారత ప్రభుత్వం తదుపరి ఆజ్ఞలు జారీ చేసేలోపు వెళ్ళిపోవాలని కేంద్రం తెలిపింది. అంతకు ముందు ఏప్రిల్ 30న అట్టారీ-వాఘా మార్గాన్ని మూసేస్తామని, ఆ లోపే వెళ్ళిపోవాలని చెప్పిన కేంద్రం తాజాగా దీనిపై వెసులుబాటును కల్పించింది. అట్టారీ-వాఘా బార్డర్ ను మూసేయడం లేదని...ఇక మీదట కూడా ఈ మార్గం ద్వారా పాకిస్తానీయులు వెళ్ళొచ్చని చెప్పింది. ఇప్పటి వరకు భారత్ నుంచి 926 మంది పాక్ పౌరులు వెళ్ళిపోగా...అక్కడ నుంచి మన దేశానికి 1814 మంది వచ్చారు.
ప్రస్తుతానికి కేంద్రం వెసులుబాటు కల్పించింది కాబట్టి పర్వాలేదు కానీ తరువాత ఆర్డర్లు వచ్చేలోపు మాత్రం పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే అంతకు ముందు చెప్పినట్టు ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది. మరోవైపు పాకిస్థానీయులను గుర్తించి వాళ్లని వెనక్కి పంపించే దిశగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు.
today-latest-news-in-telugu | attari wagah border
Also Read: India: పాక్ విమానాల నావిగేషన్ జామ్..ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలతో భారత్ యుద్ధం