/rtv/media/media_files/2025/05/01/TJwMdDr1DNMnxyeFYmTv.jpg)
India Warfare system
టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందిన కాలంలో యుద్ధం అంటే మాటలతో పని కాదు. ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేస్తే కానీ వార్ కు దిగలేరు ఎవరైనా. ఇప్పుడు భారత్ కూడా అదే పనిలో ఉంది. యుద్ధం తప్పదని ఇప్పటికే పాకిస్తాన్ కు సిగ్నల్ ఇచ్చేసింది భారత్. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాయు, జల దళాలు ఇప్పటికే తమ ఆయుధాలను పరీక్షించేసుకున్నారు. భారత ఆర్మీ రెడీగా ఉంది. ఈ క్రమంలో భారత సైన్యం మరో ముందడుగు వేసింది.
వార్ఫేర్ యుద్ధం..
పాక్ మిలటరీ విమానాలు లక్ష్యాలను గుర్తించేందుకు వీలు లేకుండా నావిగేషన్ వ్యవస్థలను జామ్ చేసేసింది. దీన్నే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. ఈ వ్యవస్థలను భారత సైన్యం పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకొంటాయి. దీని వలన దాయాది సైనిక, పౌర రవాణా ఫ్లైటు ఉపయోగించే జీపీఎస్, గ్లోనాస్, బైడూస్ నేవిగేషన్ వ్యవస్థలను సమర్ధవంతంగా అడ్డుకోవచ్చును. యుదధం జరుగుతున్నప్పుడు భారత యుద్ధ విమానాలను, డ్రోన్లు, గ్రైనేడ్స్, మిస్సైల్స్ లాంటి వాటిని గుర్తించడంలో పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది. దాని కారణంగా వారికి తెలియకుండా వారి నెత్తిన బాంబులు కురుస్తాయి. భారత్ దగ్గర ఇలాంటి వ్యవస్థలు 50 దాకా ఉన్నాయిని తెలుస్తోంది. వీటి ద్వారా వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నేవిగేషన్ సిగ్నల్స్‌ను కూడా భారత సైనయం జామ్ చేయగలదు.
ఇందులో కూడా తక్కువే..
మరోవైపు పాకిస్తాన్ ఈ విషయంలో కూడా భారత్ తో పోటీ పడలేదు. దాని దగ్గర సొంతంగా చేసుకున్న వార్ఫేర్ వ్యవస్థులు ఏమీ లేవు. చైనా దగ్గర నుంచి తెచ్చుకున్న డీడబ్ల్యూఎల్-002, జర్బా కోస్టల్ ఈడబ్ల్యూ సిస్టమ్ లు ఉన్నాయి. వీటితో భారత ఫైటర్ జెట్లను, మిస్సైల్స్ ను అడ్డుకోవడం పెద్దగా చేయలేదు. వీటికి తోడు దాయాది దగ్గర కమర్షియల్ జామర్లు కూడా ఉన్నాయి. వాటి వల్ల కూడా పెద్ద ఉయోగం లేదని తెలుస్తోంది.
today-latest-news-in-telugu | Indian Army | war | navigation-systems
Also Read: BIG Breaking: ఈరోజు రాత్రికే సర్జికల్ స్ట్రైక్..రేపు జాతినుద్దేశించి ప్రధాని సందేశం?