అతడు ఒక బిచ్చగాడు. రోజూ బిచ్చమెత్తుకుని జీవించేవాడు. ఒక పూట తిండి ఉంటే.. మరో పూట ఆకలితో ఉండేవాడు. అలాంటి ఒక బిచ్చగాడు.. దాదాపు 20 వేల మందికి విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అవునూ మీరు విన్నది నిజమే.. రోజూ బిచ్చమెత్తుకుని జీవించే ఆ బిచ్చగాడు.. తన నాయనమ్మ చనిపోగా, ఆమెకు గుర్తుగా ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుకు రూ.1.25 కోట్లు ఖర్చు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది ఎక్కడ జరిగిందో అనే విషయానికొస్తే..
Also Read: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
నాన్నమ్మకు గుర్తుగా భారీ విందు
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలాలో రాహ్‌వలి రైల్వేస్టేషన్ సమీపంలో ఇటీవల ఓ బిచ్చగాడి కుటుంబం విందు నిర్వహించింది. ఆ విందు ధనవంతులను సైతం ఆశ్చర్యపరిచింది. స్థానికంగా నివసించే ఓ బిచ్చగాడి నాన్నమ్మ ఇటీవల మరణించింది. దీంతో ఆమెకు గుర్తుగా దాదాపు 40వ రోజున భారీ విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా.. బంధువులు, తమకు తెలిసిన వారిని ఆహ్వానించారు.
Also Read: మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
విందు కోసం 2000 వాహనాలు ఏర్పాటు
ఆ విందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. వేలాది మందిని ఆహ్వానించగా వారందరూ హాజరవడం గమనార్హం. అంతేకాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న వారిని విందు వద్దకు తీసుకొచ్చేందుకు 2000 వాహనాలను సైతం ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది మాత్రమే కాదండోయ్ బాబు.. భోజనం విషయంలోనూ ఆ బిచ్చగాడి కుటుంబం అస్సలు తగ్గలేదు. పాకిస్తాన్ సంప్రదాయ వంటకాలు అయిన.. సిరి పాయా, మురబ్బా సహా నాన్ వెజ్ ఐటెమ్స్‌తో అదరగొట్టేశాడు.
Also Read: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!
అత్యద్భుతంగా డిన్నర్
డిన్నర్ కూడా ఏర్పాటు చేశాడు. డిన్నర్‌లో మటన్, నాన్ మటార్ గంజ్‌తో సహా మరిన్ని వంటకాలతో దుమ్ముదులిపేశాడు. ఈ విందు కోసం దాదాపు 250 మేకలను కోసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై చాలా మంది రకరకాలు కామెంట్లు పెడుతున్నారు. ఒక బిచ్చగాడికి ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందంటూ ఖంగుతింటున్నారు.
Also Read: తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!