స్విట్జర్లాండ్ వీసా క్యాన్సిల్.. మినీ స్విట్జర్లాండ్‌కి వెళ్లి బలి!

పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన నేవీ ఆఫీసర్ వినయ్‌ హనీమూన్‌కి స్విట్జర్లాండ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్లగా ఈ దాడి జరిగింది. వీసా రిజక్ట్ కాకపోయి ఉంటే వినయ్ చనిపోయే వాడు కాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడి దేశాన్ని కలచివేసింది. 28 మంది పర్యాటకులు ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. వీరిలో హర్యానికి చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) అనే నేవీ అధికారి కూడా ఉన్నాడు. వీరికి పెళ్లయిన ఆరు రోజులకు మరణించారు. భర్త మృతిని తట్టుకోలేక ఆ నవవధువు బాధ వర్ణణాతీతం. అయితే కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్న వినయ్‌కు ఏప్రిల్ 16న వివాహం జరిగింది.

ఇది కూడా చూడండి:TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి:Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

స్విట్జర్లాండ్ వెళ్లి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని..

తనకు స్విట్జర్లాండ్ అంటే ఇష్టం. ఇక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారట. కానీ వీసా రిజక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్ అయినా పహల్గాం వెళ్లారని వినయ్ భార్య, తాత చెబుతున్నారు. స్విటర్లాండ్ వీసా క్యాన్సిల్ కావడమే ఇలా జరిగిందని, ఇలా కాకపోయి ఉంటే వినయ్ బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి:Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
తాజా కథనాలు