BIG BREAKING: చైనా సాయంతోనే ఉగ్రదాడి.. వెలుగులోకి సంచలన నిజాలు

చైనా సాయంతోనే ఈ ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్ల సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్‌ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. పహల్గాం దగ్గర ఓ చైనీస్ శాటిలైట్ ఫోన్‌ను ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

New Update

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. కేవలం పర్యాటకులను టార్గెట్ చేసి ఉగ్రవాదుల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది మృతి చెందారు. అయితే ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనా సాయంతోనే ఈ ఉగ్రదాడికి పాక్ పాల్పడినట్ల తెలుస్తోంది. ఉగ్రవాదులు చైనీస్ యాప్‌ల ద్వారా కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. పలు డివైజ్‌లను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. పహల్గాం దగ్గర కూడా ఓ చైనీస్ శాటిలైట్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

పాక్‌కు సపోర్ట్‌గా చైనా..

ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌లో భయం నెలకొంది. భారత్‌కు భయపడి పాక్.. చైనాను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్ర ఇషాక్ దార్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్థాన్, ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించాడు. పాకిస్థాన్‌కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించింది. 

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు