Sudan: సూడాన్‌లో దారుణం.. 200 మంది మృతి

ఆఫ్రికాలోని సూడాన్‌లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.

New Update
Over 200 killed in three-day Sudan paramilitary assault

Over 200 killed in three-day Sudan paramilitary assault

Sudan: ఆఫ్రికాలోని(Africa) సూడాన్‌లో మారణహోమం జరిగింది. అక్కడి పారమిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ (RSF) బలగాలు దారుణానికి ఒడిగట్టాయి. ఫిబ్రవరి 15 నుంచి గత మూడు రోజులుగా వాళ్లు చేస్తున్న దాడుల వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. ఎమర్జెన్సీ లాయర్స్‌(Emergency Lawyers) బృందం ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే మృతుల్లో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపింది. వైట్‌నైల్‌ రాష్ట్రంలో భద్రత బలగాలు లేనటువంటి అల్ ఖైల్వాత్, అల్‌ కడారిస్ గ్రామాల్లో పలు ప్రాంతాలను ఎంచుకొని అక్కడి స్థానికులపై RSF బలగాలు దాడులు చేసినట్లు స్పష్టం చేసింది.  

Also Read: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

అంతేకాదు కాల్పుల్లో భాగంగా మహిళలను, బాలికలను కిడ్నాప్ చేయడం, ఆస్తులను దోచుకోవడం వంటి అకృత్యాలకు పాల్పడ్డట్లు  లాయర్ల బృందం తెలిపింది. నైలు నది దాటి పారిపోయేందుకు యత్నించిన చాలామందిని వెంటాడీ మరీ కాల్చి చంపినట్లు పేర్కొంది. మిగిలిన వారు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. 

Also Read: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్‌ టెస్టులు ఫ్రీ

16,650 మంది అమాయక ప్రజలు మృతి

ఇదిలాఉండగా.. 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్‌ అబ్దెల్‌ ఫత్తా అల్‌-బుర్హాన్ అతడి మాజీ డిప్యూటీ, RSF కమాండర్‌ మొహమ్మద్‌ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి సూడానీస్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ (SAF), ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (RSF) మధ్య జరిగిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 16,650 మంది అమాయక ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే ఈ దాడుల తర్వాత కోటి మందికి పైగా సూడాన్‌ వదిలి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. 

Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్

Also Read: భూకంపం టైంలో పెద్ద శబ్ధం ఎందుకు వస్తుందో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు