/rtv/media/media_files/2025/01/19/DCeDkVeosWnt8SRWKkl1.jpg)
Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఫెడరల్,యూఎస్ ఎయిడ్ ఉద్యోగుల పై వేటు వేసిన విషయం తెలిసిందే.తాజాగా ఈ తొలగింపు ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.పర్యావరణ పరిరక్షణ సంస్థకు నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్లు, పరిశోధకులను తొలగించే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన వారిని ఇతర ఏజెన్సీలకు తరలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read:Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!
కాలుష్యం ,నీటిశుద్ది,వాతావరణ మార్పులు తదితర పర్యావరణ అంశాల్లో 1500 మంది శాస్త్రవేత్తలు కీలకంగా వ్యవహరిస్తున్నారు.వారిని విధుల నుంచి తొలగిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని డెమోక్రటిక్ చట్ట సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థలో శ్రామిక శక్తిని తగ్గించడం ద్వారా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trump Administration To Fire
ఫిబ్రవరిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణ సంస్థను పర్యవేక్షించడానికి ఎంపిక చేసిన 17,000 మంది సిబ్బందిలో దాదాపు 65 శాతం మందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం పై ఈపీఏ ప్రతినిధి మోలీ వాసెలియా మాట్లాడుతూ..ఏజెన్సీ సంస్థాగత మెరుగుదలను తదుపరి దశలోకి తీసుకెళ్తేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి,నీరు,భూమని అందించడానికి కృషి చేసే తమ సామర్థ్యాన్ని పెంచడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.తొలగింపు విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనప్పటికీ..సంస్థ ఎప్పటికీ ప్రభావవంతంగా పని చేయడానికి మార్పులు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పని చేస్తున్న మస్క్ నేతృత్వంలోని డోజ్‌ఇప్పటికే అనేకమంది యూస్ ఎయిడ్ ఉద్యోగుల పై వేటు వేసింది. వృథా ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వ సంస్థల్లో పలువురు ఉద్యోగులను తొలగించడానికి చర్యలు తీసుకుంటుంది.డోజ్ నిర్ణయాలను ట్రంప్ సైతం సమర్థిసత్ఉన్నారు. ఆయన తీసుకొన్న ఈ తొలగింపు నిర్ణయం శాస్త్రవేత్తల్లో భయాందోళన కలిగిస్తోంది.
Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!
Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!