IND PAK WAR 2025 : అత్యవసరంగా జమ్మూకు ఒమర్‌ అబ్దుల్లా.. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ దాడులకు తెగబడుతోంది. దీంతో అక్కడి అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి సీఎం ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు.

New Update

IND PAK WAR 2025 :  భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంలో జమ్మూలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్‌ దాడులకు తెగబడుతోంది.  దీంతో అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు గాను సీఎం  ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షిస్తారు. ప్రజలకు, సైన్యానికి అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది.

Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
 
 జమ్మూలోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్‌ ఓ వైపు డ్రోన్లతో దాడి చేస్తోంది. వాటిని భారత సైన్యం తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు సైన్యాన్ని అప్రమత్తం చేయడానికి జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్ధుల్లా శ్రీనగర్‌ నుంచి జమ్మూకశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా జమ్మూతో పాటు ఇతర ప్రాంతాలపై పాకిస్థాన్‌ చేస్తున్న దాడుల నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులను అంచనా వేయడానికి జమ్మూకశ్మీర్‌ వెళుతున్నట్లు ఒమర్‌ ప్రకటించారు.  జమ్మూ, సాంబా, ఆర్‌ఎస్ పురాతో పాటు పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్‌లు, స్మాల్‌ రేంజ్‌ మిస్సైల్స్‌ దాడికి ప్రయత్నించగా.. సైన్యం తిప్పికొట్టింది.  

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

పాకిస్తాన్ సైన్యం ఉరి, తంగ్ధర్, పూంచ్, నియంత్రణ రేఖలోని రాజౌరి, అంతర్జాతీయ సరిహద్దులోని సాంబాలో భారీ మోర్టార్ దాడులు కొనసాగించింది, జమ్మూ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్లు, స్మార్‌ రేంజ్‌ మిస్సైల్స్‌ని పాక్‌ సైన్యం ప్రయోగించింది. వాటిని రక్షణ వ్యవస్థలు గాలిలోనే పేల్చివేశాయి.

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

అయితే శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది. అడుగడుగున భద్రతా బలగాలు మోహరించాయి.  ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని అధికారులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. ప్రమాదం పొంచిఉన్న పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని అంచనావేయడానికి ఒమర్‌ జమ్మూ ప్రయాణమయ్యారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

#WATCH | Jammu and Kashmir: Morning visuals from Akhnoor. Pakistan has resorted to artillery shelling on civilian...

Posted by Northeast Live on Thursday, May 8, 2025
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు