/rtv/media/media_files/2025/04/30/7QCvjNXvav56vC3iz4LY.jpg)
Odisha Prisoner marries the woman he raped
Crime: ఒడిశాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు తన మనసు మార్చుకుని బాధితురాలినే భార్యగా అంగీకరించాడు. అంతేకాదు ఖైదీగా ఉండగానే ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. అయితే చట్ట ప్రకారం ఈ కేసులో తుది తీర్పు వెలువడే వరకు నిందితుడు జైలులోనే ఉండనుండగా.. ఓడిశాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కోరిక తీరగానే మోసం..
ఈ మేరకు ఒడిశా రాష్ట్రంలోని గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహెరా.. 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మొదట ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు. కోరిక తీరగానే మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి మోసపోయానంటూ పోలసర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 2024 నవంబరులో సూర్యకాంత్‌ను అరెస్టు చేసి కొడాలా సబ్‌జైలుకు తరలించారు.
ఇది కూడా చూడండి: Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
అయితే ఈ విషయం కాస్త తమ గ్రామం, బంధువుల్లో చర్చనీయాంశమవగా పరువు కాపాడుకోవాలని అబ్బాయి పేరెంట్స్ ఆలోచించారు. అంతేకాదు ఈ కేసును కూడా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అమ్మాయి కుటుంబంతో చర్చించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడికే బాధిత యువతిని ఇచ్చి పెళ్లి చేయాలని తీర్మాణం చేశారు. దీంతో ఆ యువకుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని, కేసు కొట్టివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అనుమతించడంతో కొడాలా సబ్‌జైలులో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. అయితే ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు సూర్యకాంత్ జైలులోనే ఉంటాడని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన
odisha | sexcual harrisement | jail | marriage | telugu-news | today telugu news