Silver Biscuits: ఒడిశాలో భారీ వెండి బిస్కెట్ల పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

ఒడిశాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 110 కిలోల వెండి బిస్కెట్లను ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.1.10 కోట్లు ఉంటుదని అంచనా వేస్తున్నారు. కారు సీజ్‌ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

New Update
Silver Biscuits

Silver Biscuits

Odisha Crime News: ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా రెంగాలి ప్రాంతంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ తనిఖీల్లో భారీ వెండి అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. రెంగాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఓ కారును తనిఖీ చేయగా అందులో 110 కిలోల వెండి బిస్కెట్లు ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రెండు రాష్ట్రాల మధ్య భారీగా నకిలీ ఆభరణాలకు తీసుకెళ్తున్న బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఈ వెండి బిస్కెట్లను జార్ఖండ్‌ రాజధాని రాంచీకి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

కోట్ల విలువ చేసే వెండి బిస్కెట్లు స్వాధీనం..

 ఈ తరలింపు సంబంధించి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. వెండి బిస్కెట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు..? ఏ ఉద్దేశంతో తరలిస్తున్నారు..అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ బిస్కెట్ల బరువు మొత్తం 110 కిలోలు కాగా.. మార్కెట్ విలువను అధికారులు సుమారు రూ.1.10 కోట్లుగా అంచనా వేస్తున్నారు. వెండి ధరల పెరుగుదల దృష్టిలో పెట్టుకుంటే.. ఇది చాలా పెద్ద అక్రమ రావాణని పోలీసులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: చేతుల్లో ఈరాయి ఉంటే చాలు థైరాయిడ్ కారణంగా పెరిగిన బరువుని తగ్గించుకోవచ్చు

ఇది చట్టవిరుద్ధంగా విలువైన లోహాలను తరలిస్తున్న ముఠాల పరిమాణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా అక్రమ రవాణా వ్యవహారాలు ఆరికట్టాలని అధికారులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో నిఘా పెంచాలంటున్నారు. వెండి, బంగారం వంటి విలువైన లోహాల రవాణా క్రమబద్ధంగా జరగకుండా చూడాలంటున్నారు. దీంతోపాటు ఈ రవాణాకు పాల్పడుతున్న వారిని పటుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇద్దరి నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ దగ్గర పసికందు మృతదేహం కలకలం

( silver | crime | crime news | Latest News | telugu-news)

Advertisment
తాజా కథనాలు