Rajya Sabha: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం..!

రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి ఆలోచిస్తోంది. కూటమి పార్టీలు ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం బిల్లు పాస్ అవ్వడానికి రాజ్యసభలో ఇండియా బ్లాక్‌కు రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేదు.

author-image
By K Mohan
New Update
rajyasabha

గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ఉభయసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ, లోక్ సభలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా బ్లాక్ కూటమి ఆలోచిస్తోంది. ఇండియా కూటమి పార్టీలు ఇందుకు అనుగుణంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాజ్యసభ చైర్మన్ సభలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.

READ ALSO : కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

Rajya Sabha Jagdeep Dhankhar

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజగం, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలకు చెందిన 50 మంది కంటే ఎక్కవ మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసి రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మంగళవారం ఉదయం రాజ్యసభ ఛైర్‌పర్సన్ జగదీప్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

READ ALSO : ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా వ్యవహరిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బిల్లు పాస్ అవ్వడానికి ప్రతిపక్షాలకు సంఖ్యాబలం లేదు. అవిశ్వాస తీర్మానం సభ చర్చకు రావాలంటే మొత్తం రాజ్యసభ సభ్యుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మద్దతు ఉండాలి. రాజ్యసభలో చర్చ జరగాలనే కోరుకుంటున్నామని.. చైర్మన్ తీరు వల్ల సభ సజావుగా సాగడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అసంతృ‌ప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు