Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 

New Update
Nitin Nabin Takes Oath as Bjp National President

Nitin Nabin Takes Oath as Bjp National President

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ (45) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ సమక్షంలో ఆయన పార్టీ చీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో నితిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.  మంగళవారం ఉదయం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయంలో నితిన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

నితిన్ నబీన్ ఎవరు ?

నితిన్ నబీన్ 1980 రాంచీలో జన్మించారు. ఈయన తండ్రి నబీన్ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా బీజేపీ ఎమ్మెల్యేగా సేవలందించారు. 2006లో తండ్రి మరణించడంతో నితిన్ నబీన్ రాజకీయ ప్రవేశం చేశారు. అదే ఏడాదిలో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2010, 2015, 2020 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌ నుంచి అయిదోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాయస్థ సామాజికవర్గానికి చెందిన ఈయన RSS నేపథ్యంతో అంచెలంచెలుగా ఎదిగారు. వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు.  

ఓటమి ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో ఛత్తీస్‌గడ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జీగా పనిచేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో హైకమాండ్‌ వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి బిహార్‌ నుంచి పార్టీ జాతీయ అధ్యక్ష స్థాయికి చేరిన తొలి నేతగా నితిన్ నిలిచారు. ఇక ఈ ఏడాదిలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నితిన్‌ నబీన్‌ పార్టీ నేతలను ఎలా సమన్వయం చేస్తారనేది ఆసక్తిగా మారింది. 

Also Read: భారత్‌, యూఏఈ కీలక ఒప్పందాలు.. 2032 నాటికి 200 బిలియన్‌ డాలర్లు టార్గెట్

Advertisment
తాజా కథనాలు