Union Budget 2026 : 75 ఏళ్ల సంప్రదాయానికి నిర్మలమ్మ బ్రేక్!

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 ఒక చారిత్రాత్మక మార్పుకు వేదిక కానుంది. గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగ శైలిని పక్కన పెడుతూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి సరికొత్త పంథాను అనుసరించబోతున్నారు.

New Update
nirmala

నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27(Union Budget 2026-27) ఒక చారిత్రాత్మక మార్పుకు వేదిక కానుంది. గత 75 ఏళ్లుగా కొనసాగుతున్న బడ్జెట్ ప్రసంగ శైలిని పక్కన పెడుతూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(fm nirmala sitharaman) ఈసారి సరికొత్త పంథాను అనుసరించబోతున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో 'పార్ట్-A'లో ప్రభుత్వ పథకాలు, వివిధ రంగాలకు కేటాయింపుల గురించి సుదీర్ఘంగా వివరించి, 'పార్ట్-B'లో కేవలం పన్నుల మార్పులను క్లుప్తంగా ముగిస్తారు. కానీ, ఈసారి 'పార్ట్-B' ప్రసంగమే హైలైట్‌గా నిలవనుందని అధికారిక వర్గాల సమాచారం.

ఈ సరికొత్త మార్పులో భాగంగా, దేశ ఆర్థిక వ్యవస్థను రాబోయే పాతికేళ్లలో (2047 నాటికి) ఏ స్థాయికి తీసుకెళ్లాలనే 'వికసిత్ భారత్' విజన్‌ను నిర్మలా సీతారామన్ 'పార్ట్-B'లో వివరంగా వివరించనున్నారు. కేవలం పన్నుల ప్రకటనలకే పరిమితం కాకుండా, స్వల్పకాలిక లక్ష్యాలు, దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను ఇందులో పొందుపరచబోతున్నారు. భారత స్థానిక బలాలు, ప్రపంచ వేదికపై దేశ ఆర్థిక సామర్థ్యాన్ని చాటిచెప్పేలా ఈ ప్రసంగం ఉండబోతోంది. ముఖ్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు భరోసానిచ్చేలా భారత ఆర్థిక రోడ్ మ్యాప్‌ను ఈ భాగంలో ఆవిష్కరించనున్నారు.

Also Read :  Union Budget : 27 ఏళ్ల తర్వాత ఆదివారం బడ్జెట్.. నిర్మలమ్మ సరికొత్త రికార్డు!

నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు

ఈ బడ్జెట్‌(Union Budget 2026) తో నిర్మలా సీతారామన్ మరికొన్ని అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే, 2017లో బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చిన తర్వాత, సెలవు రోజైన ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఇదే మొదటిసారి. గతేడాది బడ్జెట్‌లో మధ్యతరగతికి పన్ను ఊరటనిచ్చిన నేపథ్యంలో, ఈసారి 'పార్ట్-B'లో పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ఏవైనా కీలక ప్రకటనలు ఉంటాయా అని దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :  ముంబైలో కలకలం: దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు!

Advertisment
తాజా కథనాలు