/rtv/media/media_files/2026/02/01/rohit-2026-02-01-08-01-19.jpg)
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. శనివారం అర్ధరాత్రి జుహులోని ఆయన నివాసం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.
అర్ధరాత్రి సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు రోహిత్ శెట్టి ఉంటున్న బిల్డింగ్ లక్ష్యంగా కాల్పులు జరిపి పరారయ్యారు. ఒక్కసారిగా పేలిన తుపాకీ శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ముంబై క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ బృందాలు మరియు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Shots fired outside filmmaker Rohit Shetty's residence in Mumbai.
— Vani Mehrotra (@vani_mehrotra) February 1, 2026
Police and forensic teams have secured the premises for a search. pic.twitter.com/t0XmuN8DOU
ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భారతి ఈ ఘటనను తెలిపారు. "బిల్డింగ్‌పై ఎవరో కాల్పులు జరిపారు. జోనల్ పోలీసులు మరియు క్రైమ్ బ్రాంచ్ దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి" అని ఆయన తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, ఆ ప్రాంతంలో భారీగా భద్రతను పెంచారు.
బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా
#WATCH | Mumbai | Unidentified assailants fired four rounds outside the residence of film director Rohit Shetty last night
— ANI (@ANI) February 1, 2026
Mumbai Police says, "Following this, heavy police security has been deployed around Rohit Shetty's residence in Juhu. The police are currently… pic.twitter.com/XZlzspFeMU
ఈ దాడి వెనుక ఉద్దేశం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే అంతర్జాతీయ గ్యాంగ్‌ల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కేవలం భయపెట్టడానికే ఈ కాల్పులు జరిపారా లేదా మరేదైనా కారణం ఉందా? అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పహారా కొనసాగుతోంది. ఈ ఘటనపై రోహిత్ శెట్టి గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Follow Us