NIA: ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ఎన్‌ఐఏ సోదాలు

మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఎన్ఐఏ ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో నిర్వహించింది. డిజిటిల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. 

New Update
NIA

ఏపీలో చితూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మావోయిస్టులకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు సఫరా చేస్తున్నారనే కేసులో ఏడుగురు నిందితుల ఇళ్ళల్లో సోదాలు చేశారు. దీంతో పాటూ ఛత్తీస్‌ఘడ్, ఒడిశాలలో కూడా సోదాలు నిర్వహించారు. సోదాల్లో కొన్ని డిజిటల్‌ పరికరాలు, పత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సబంధించి ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. 

Also Read :  రీల్స్ కోసం స్టంట్.. రైలు నుంచి జారిపడిన యువతి!

Also Read :  పెళ్లి తర్వాత అప్పుడే నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్

చింతూరు పోలీసు కేసు ఆధారంగా..

 2024 సెప్టెంబరులో చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకుని  ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కొంత మంది నిందితుల దగ్గర నుంచి పేలుడు పదార్ధాలు, విప్లవ సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. మావోయిస్టులకు పెద్దఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను ఎన్ఐఏ గుర్తించింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు బలగాలను చంపేందుకు కుట్రపన్నినట్టు ఎన్ఐఏ చెప్పింది. 

Also Read: Gukesh: పదేళ్ళ కల సాకారం అయింది–గుకేశ్

Also Read :  భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. హోంమంత్రి కీలక సూచనలు

Advertisment
తాజా కథనాలు