Delhi: ప్రత్యేక జడ్జి ఎదుట తహవూర్ రాణా

ముంబయ్ పేలుళ్ళ కేసలో ప్రధాన సూత్రధాని అయిన తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు అర్థరాత్రి ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు.  రాణాకు 20 రోజుల కస్టడీ ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా..18రోజులకు జడ్జి అనుమతించారు.

author-image
By Manogna alamuru
New Update
delhi

Tahawwur Rana

ఉగ్రవాది తహవూర్ రాణా కూసులో ఈరోజు అర్థరాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. అతనిని ఎన్ఐఏ అధికారులు కొంతసేపటి క్రితం ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ కార్యాలయం, పటియాలా హౌస్‌ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాణా కేసు విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పియూష్ సచ్ దేవా ను నియమించింది.  అలాగే ఎన్ఐఏ తరుఫున సీనియర్‌ న్యాయవాది దయాన్‌ కృష్ణన్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నరేందర్‌ మాన్‌ ఎన్‌ఐఏ తరఫున కోర్టులో వాదనలను వినిపించారు. ఇరు వర్గాల వాదనలు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి చందర్ జిత్ సింగ్ వాదనలు విన్నారు. తహవూర్ రాణాను 20 కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరగా 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. అతడిని చట్టం ముందుకు తీసుకొచ్చేందుకు ఏళ్ల తరబడి కృషి చేస్తున్నామని ఎన్ఐఏ ఇంతకు ముందే చెప్పింది. ఎన్‌ఐతో పాటు ఎన్‌ఎస్‌జీ, భారత విదేశాంగ శాఖ, హోంశాఖ, యూఎస్‌ డీఓజే, అమెరికాలోని సంబంధిత అధికారుల వల్ల ఈ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యిందని తెలిపింది.   

 

2-3 నెలల్లో ఉరితీయండి..

మరోవైపు ముంబై 26/11 దాడి ప్రధాన నిందితుడు తహవూర్ రాణాపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. రాణా ఇండియాకు చేరుకోగానే ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. జైలులో బిర్యానీ పెట్టి విశ్రాంతి తీసుకోమని మర్యాదలు చేయొద్దని కోరుతున్నారు. ఈ మేరకు రాణా నేడు భారతదేశానికి చేరుకోనుండగా అతన్ని తీహార్ జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బాధితులు, దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. 'రాణా లాంటి ఉగ్రవాదులకు భారతదేశం ఎలాంటి సౌకర్యాలు కల్పించకూడదు. కసబ్‌కు ఇచ్చినట్లుగా బిర్యానీ లేదా విశ్రాంతి ఇవ్వకూడదు. అటువంటి ఉగ్రవాదుల కోసం ప్రత్యేక చట్టం చేయాలి. తద్వారా వారిని 2-3 నెలల్లో ఉరితీయవచ్చు' అని ఆ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలను కాపాడిన మహ్మద్ తౌఫిక్ అలియాస్ 'ఛోటు చాయ్ వాలా' అన్నారు.

 today-latest-news-in-telugu

Also Read: RCB VS DC: ఢిల్లీ విజయయాత్ర..వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు