NIA Investigation: జ్యోతి మల్హోత్ర కేసులో బిగ్ ట్విస్ట్.. ఇండియాలో పాక్ గూఢచారులను నియమించింది ఇతనే

పాక్‌కు గూఢచారులుగా భారత్‌లో పట్టుబడిన ‌యూట్యూబర్లతో పాకిస్తాన్ మాజీ పోలీస్, ISI ఏజెంట్‌తో సంబంధాలున్నాయని వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పంజాబ్‌లో మాజీ SI, ప్రస్తుత యూట్యూబర్ నాసిర్ ధిల్లాన్‌ ఇండియాలో స్లీపర్ సెల్స్ నియమించాడని NIA దర్వాప్తులో తేలింది.

New Update
Nasir Dhillon

పాకిస్తాన్ స్పై జ్యోతి మల్హోత్ర కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పాక్‌కు గూఢచర్య చేస్తూ పట్టపడిన భారత్ ‌యూట్యూబర్స్‌తో పాకిస్తాన్ మాజీ ఆర్మీ ఉద్యోగి, ISI ఏజెంట్‌తో సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ పంజాబ్ పోలీస్‌గా పని చేసిన సబ్-ఇన్‌స్పెక్టర్, ప్రస్తుతం యూట్యూబర్ అయిన మేడమ్ ఎన్ నాసిర్ ధిల్లాన్‌ ఇండియా స్లీపర్ సెల్స్ రికృూట్ చేసుకున్నాడని NIA దర్వాప్తులో తేలింది.

Also Read :  ‘ఎయిర్‌పోర్ట్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లి.. రూ.2.65 లక్షల నష్టపోయాడు’

Nasir Dhillon Was Recruited Indian Sleeper Cells

Also Read :  కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య.. మృతదేహం చెరువులో లభ్యం

భారతదేశంలో గూఢచర్య ముఠాకు సూత్రధారిగా ఉండటం, ఖలిస్తానీ ప్రచారాన్ని ప్రోత్సహించడంపై నాసిర్ ధిల్లాన్‌ ఫొకస్ పెట్టాడు. గూఢచర్య నెట్‌వర్క్‌లో పాల్గొనడం, ISI కోసం వ్యక్తులను నియమించడం వంటి ఆరోపణలతో  ఆయన నిఘాలో ఉన్నారు. ఈ ముఠాలో వందలాది మంది పాకిస్తాన్ మాజీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. పంజాబ్ నుంచి జస్బీర్ అరెస్టు కీలకం. ఎందుకంటే నాసిర్ ధిల్లాన్ తనను ISI ఏజెంట్‌కు పరిచయం చేశాడని, లాహోర్‌లో ఆ ఏజెంట్‌తో సమావేశం ఏర్పాటు చేశాడని అతను వెల్లడించాడు.

Also Read :  ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ధిల్లాన్‌కు చాలా మంది భారతీయ యూట్యూబర్‌లతో సంబంధాలు ఉన్నాయి. వారితో ఫ్రెండ్‌షిప్ చేశాడు. వారిని ISI ఏజెంట్లకు పరిచయం చేయించాడు. జ్యోతి మల్హోత్రాతో కూడా నాసిర్ ధిల్లాన్‌కి పరిచయం ఉంది. ఆమెతో అతను పాడ్‌కాస్ట్ కూడా చేశాడు. దర్యాప్తు ప్రకారం, నాసిర్ ధిల్లాన్ భారతీయ యూట్యూబర్‌లను ISI కార్యకర్తలకు పరిచయం చేసిన తర్వాత వారికి గూఢచర్య పనులను ఇచ్చేవాడని తేలింది.

Also Read :  కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారంపై బిగ్ అప్డేట్!

 

latest-telugu-news | Pakistan Spy Scandal | pakistan spy network | JYOTHI MALHOTRA | India Pakistan spy | Jyoti Malhotra Pakistan Spy Case

Advertisment
Advertisment
తాజా కథనాలు