/rtv/media/media_files/2025/03/11/5YVHVftMSNxYlyenahhQ.jpg)
New currency
New Currency : రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను విడుదల చేయనుంది. గతంలో మాదిరిగానే మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ పాతనోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: జుట్టు పెరగాలంటే బీట్‌రూట్‌ను ఇలా ఉపయోగించండి
కాగా ఇటీవల శక్తికాంత దాస్ పదవీ విరమణ చేసిన అనంతరం సంజయ్ మల్హొత్రా ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శక్తికాంత దాస్ పదవీ కాలం పొడిగించబడింది. అనంతరం సంజయ్ మల్హొత్రా 26వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ మల్హొత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన 3 సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు.
ఇది కూడా చదవండి: తమలపాకులను నీటిలో మరిగించి తాగితే మీలో ఈ మార్పు గ్యారంటీ
గతంలో రిజర్వ్ బ్యాంక్ కొత్త రూ.500 నోట్లను జారీ చేసింది. పాత రూ.1000 నోట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. త్వరలో రూ.50 నోట్లు కూడా విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఈ కొత్త నోట్లపై గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకం కూడా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. కొత్త సిరీస్ లోని మహాత్మ గాంధీ చిత్రం కూడా ఈ నోట్లపై ముద్రించబడుతుంది. ఈ నోటుపై కొత్త భద్రతా లక్షణాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా నోటును కాపీ చేయడం కష్టమవుతుంది.
ఇది కూడా చదవండి: గుండెపోటుకు 30 రోజుల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి
దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల వ్యాప్తిని ఆపవచ్చు. గతంలో రూ.500 నోట్ల భద్రతా లక్షణాలను పెంచడం ద్వారా దానిని నకిలీల నుంచి రక్షించారు. ఇప్పుడు ఆర్బీఐ చిన్న విలువ గల నోట్లను కూడా మారుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే కొత్త రూ.50, 100, 200 నోట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోట్లపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకం మాత్రమే కాకుండా.. వాటి భద్రతా లక్షణాలు కూడా మెరుగుపరచబడతాయి.
Also read : గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు... హైయెస్ట్ మార్కులు వీరికే .. కటాఫ్ ఎంతంటే!
Also read : చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానంటే రిజెక్ట్ చేశా : సోము వీర్రాజు కీలక కామెంట్స్