/rtv/media/media_files/2025/01/14/PK73FOcb1BWgrbw08Wg6.jpg)
PM Modi
భారత వాతావరణ శాఖ (IMD) 150 ఏళ్ల వేడుకను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'మిషన్ మౌసం' ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గుర్తుగా ఐఎండీ విజన్-2047 పత్రాన్ని, స్మారక నాణేన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో జరిగే నష్టాలను తగ్గించేందుకు వాతావారణ శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. భూకంపాల రాకను ముందే గుర్తించే హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు.
Also Read: ఓ వైపు కార్చిచ్చు..మరో వైపు చుక్కలనంటుతున్న అద్దెలు..ఇంకో పక్క
'' ప్రస్తుతం పర్యావరణ మార్పుల వల్ల ఊహించని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించి.. కచ్చితమైన అంచనాలు విడుదల చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, అలాగే అధిక రిజల్యూషన్‌తో ఉన్న వాతావరణ పరిశీలన కోసం మిషన్ మౌసంను ప్రారంభించాం. వాతావరణం గురించి అవగాహనను మెరుగుపరచడం, గాలి నాణ్యత డేటాను అందించే అంశాలపై మిషన్ మౌసం ఫోకస్ పెడుతుంది. వివిధ దేశాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా వాటికి సాయం చేయడంలో భారత్ ముందుంటుంది.
Also Read: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం..
వాతావరణశాఖలో సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల భారత విపత్తు నిర్వహణ సామర్థ్యాలు పెరిగాయి. ఇది దేశానికే కాక ప్రపంచ దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని'' ప్రధాని మోదీ అన్నారు. ఇదిలాఉండగా ఈ కార్యక్రమంలో ప్రపంచ వాతావరణ శాఖ సెక్రటరీ జనరల్ సెలస్ట్ సౌలో, భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి జితేంద్ర సింగ్, అలాగే ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు
Also Read: మరోసారి వాయిదా పడ్డ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ!
 Follow Us