/rtv/media/media_files/2025/05/03/ry3mVh2nYTWTxsvjh4YY.jpg)
pak-assam-cm
పాకిస్తాన్ జిందాబాద్ అని ఎవరు నినాదాలు చేస్తే వారి కాళ్ళు విరగ్గొడతామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు. శుక్రవారం ధుబ్రిలో జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపారు. అయినప్పటికీ మనలో కొందరు పాకిస్తాన్ జిందాబాద్ అని అంటున్నారు. తాము వారిలో చాలా మందిని అరెస్టు చేసాము. ఎవరైనా 'పాకిస్తాన్ జిందాబాద్' అని నినాదాలు చేస్తే, మేము వారి కాళ్ళు విరగ్గొడతాము అని సీఎం హెచ్చరికలు జారీ చేశారు.
ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌ను
ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌ను పొగిడే వాళ్లు ఈ దేశానికి అవసరం లేదని సీఎం త్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. 'పాకిస్తాన్ జిందాబాద్' అని అంటున్నవారిని చట్ట ప్రకారం వారిని అరెస్టు చేసి కాళ్ళు విరగ్గొట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. పహల్గామ్ దాడి తర్వాత శర్మ విచారం వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులను కనిపెట్టి వారికి కఠినమైన శిక్ష విధించగలిగేలా ప్రధాని మోదీ, భారత సైన్యానికి దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరారు.
Also read : India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం
Also read : Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!
పహల్గామ్ దాడి తర్వాత భారత గడ్డపై పాకిస్తాన్‌ను సమర్థిస్తున్నారనే ఆరోపణలపై అస్సాంలో కనీసం 36 మందిని అరెస్టు చేశారు ఇప్పటివరకు అస్సాంకు చెందిన AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంతో సహా 36 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాంతో పాటుగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టులు అయ్యాయి.
Also read : BCCIకి బిగ్ షాక్.. రోబో కుక్క వల్ల కోట్లలో లాస్.. హైకోర్టు నోటీసులు!
Also Read : UPSC CSE 2024 : కళ్లు కనిపించవు, తల్లి ప్రోత్సాహం.. UPSC ఫలితాల్లో 91వ ర్యాంక్ !