NDA: బీహార్లో నితీష్-మోదీకి బిగ్ షాక్.. భారీగా నామినేషన్లు రిజెక్ట్!

జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ.

New Update
bjp nda

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(bihar-assembly-elections) ముందు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కు ఊహించని షాక్ తగిలింది.  సారన్ జిల్లాలోని మర్హౌరా అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా NDA మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అభ్యర్థి సీమా సింగ్‌తో సహా మొత్తం నలుగురు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు రిజెక్ట్ అయ్యాయి.

Also Read :  భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి విలువైన టపాసులు దగ్ధం

ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భోజ్‌పురి సినీ నటి అయిన సీమా సింగ్‌తో పాటు మిగిలిన ముగ్గురు అభ్యర్థులు (అల్తాఫ్ ఆలం రాజు (స్వతంత్ర),  ఆదిత్య కుమార్ (బహుజన్ సమాజ్ పార్టీ), విశాల్ కుమార్ (స్వతంత్ర)నామినేషన్ పత్రాలలో సాంకేతిక లోపాలతో పాటుగా మరికొన్ని  సరిగ్గా లేవని వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి రద్దు చేశారు.  

జేడీయూ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్తాఫ్ ఆలం రాజు నామినేషన్ కూడా రిజెక్ట్ అయింది. రాజకీయాల్లోకి వచ్చిన సీమా సింగ్ ను మార్హౌరా నుంచి బరిలోకి దింపింది లోక్ జనశక్తి పార్టీ. ఆమె నామినేషన్ తిరస్కరణ NDA కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మార్హౌరాలో పోటీ ఆర్జేడీకి చెందిన జితేంద్ర రాయ్, జాన్ సురాజ్ అభయ్ సింగ్ మధ్య ప్రత్యక్ష పోరుగా మారింది.

Also Read :  పండగ వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. NHAI కీలక ప్రకటన

తొలి దశలోనే పోలింగ్

మర్హౌరా అసెంబ్లీ నియోజకవర్గానికి బీహార్ ఎన్నికల తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. జితేంద్ర రాయ్, ప్రస్తుత ఎమ్మెల్యే, బీహార్ మాజీ మంత్రి కావడంతో రాయ్ తిరిగి ఎన్నికయ్యే మార్గం సులభమైందని రాజకీయ నిపుణులు అంటున్నారు. సీమా సింగ్ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, మహారాష్ట్రలో 9వ తరగతి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం, రాజకీయాల ద్వారా మర్హౌరా ప్రజలకు సేవ చేయాలని ఆమె ఆశించారు.

Advertisment
తాజా కథనాలు