BREAKING: భారీ అగ్నిప్రమాదం.. రూ.కోటి విలువైన టపాసులు దగ్ధం

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం సంగుపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల షాప్‌లో ఈ ప్రమాదం జరగడంతో రూ.కోటి విలువైన టపాసులు దగ్ధమవ్వడం కలకలం రేపింది.

New Update
A massive fire broke out at a firecracker warehouse on the outskirts of Sangareddy’s Andole area

A massive fire broke out at a firecracker warehouse on the outskirts of Sangareddy’s Andole area

సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ మండలం సంగుపేట గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల షాప్‌లో ఈ ప్రమాదం జరగడంతో రూ.కోటి విలువైన టపాసులు దగ్ధమవ్వడం కలకలం రేపింది. ఇర వివరాల్లోకి వెళ్తే.. దీపావళి సందర్భంగా ఆ గ్రామ శివారులో కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ అనే బాణాసంచా దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అయితే టపాసుల ప్యాకింగ్ చేసే పేపర్ల వ్యర్థాల్లో అనుకోకుండా నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

Also Read: తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

గోదాం ఆవరణలో ఉన్న హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాల వరకు మంటలు విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు రావడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. చివరికి సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో రూ.కోటి విలువైన టపాసులు పేలిపోయాయని అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ఆమె శాపంతో వందేళ్లుగా ఈ గ్రామంలో దీపావళి జరగట్లేదు

Advertisment
తాజా కథనాలు