/rtv/media/media_files/2025/03/06/ItCY3CkcxprLgb7LsaXW.jpg)
Mystery disease claims 13 lives in Chhattisgarh's Sukma village
ఛత్తీస్‌గఢ్‌లో గుర్తు తెలియని వ్యాధి కలవరపెడుతోంది. సుక్మా అనే జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వ్యాధి వల్ల ఏకంగా 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లందరూ ఒక నెల వ్యవధిలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య విభాగం అలెర్ట్ అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ధనికోర్తా అనే గ్రామంలో కొందరికి ఛాతినొప్పు, విపరీతమైన దగ్గు వంటి లక్షణాలు వచ్చాయి. ఈ క్రమంలోనే 13 మంది నెల వ్యవధిలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి.
Also Read: పెళ్లైన రెండోరోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. షాక్‌లో వరుడు, అతని కుంటుంబం ఏం చేశారంటే!
ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరికీ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ అంతుచిక్కని వ్యాధి వార్తలపై సుక్మా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. వాళ్లలో ముగ్గురు వృద్ధాప్య సమస్యల వల్ల చనిపోయినట్లు పేర్కొన్నారు.
Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ
అలాగే మిగతా ఇద్దరి మృతికి గల కారణాలు పరిశీలిస్తున్నామని వివరించారు. ఇప్పటిదాకా గుర్తించిన దాని ప్రకారం చూసుకుంటే.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణాలు కావొచ్చని కూడా తెలిపారు. అయితే ఈ పంట సేకరణ చేసేటప్పుడు గ్రామస్థులు ఒక రోజంతా అటవీ ప్రాంతాలోనే ఉంటారన్నారు. దీనివల్ల వాళ్లు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు.
Also Read: పోసానికి ఏపీ హైకోర్టులో నిరాశ..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు.
Also Read: సొంత పౌరులపైనే బాంబు దాడి.. వాయుసేన శిక్షణ కార్యక్రమంలో ఘోరం!