Bihar Assembly Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్లు ... ఆస్తులెంతో తెలుసా?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు మాజీ పోలీసు అధికారులు పోటీ చేయనున్నారు. ముంగేర్ జిల్లాలోని జమాల్పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా  శివదీప్ లాండే, బక్సర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆనంద్ మిశ్రా పోటీలో నిలిచారు.

New Update
bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఇద్దరు మాజీ పోలీసు అధికారులు పోటీ చేయనున్నారు. ముంగేర్ జిల్లాలోని జమాల్పూర్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా  శివదీప్ లాండే, బక్సర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆనంద్ మిశ్రా పోటీలో నిలిచారు. వీరిద్దరిలో అనేక పోలికలు ఉన్నాయి. ఇద్దరు మాజీ సహచరులు కాగా..  సూపర్ కాప్స్ గా పేరు సంపాదించుకున్నారు.  ఇద్దరూ తమ ఉద్యోగానికి రాజీనామా చేశాకే రాజకీయాల్లోకి వచ్చారు. వీరిద్దరి భార్యలు వ్యాపారవేత్తలు కావడం మరో ఆసక్తికరమైన పోలిక.

శివదీప్ లాండే(49) మహారాష్ట్రలోని అకోలా జిల్లా, విదర్భ ప్రాంతానికి చెందినవారు. ఆయనది రైతు కుటుంబం. మాజీ మహారాష్ట్ర జలవనరులు, సంరక్షణ శాఖ మంత్రి విజయ్ శివతారే కుమార్తె అయిన మమతా శివతారేను ఈయన వివాహం చేసుకున్నారు. అంతకుముందు ఐఆర్‌ఎస్ (IRS) కు కూడా ఎంపికయ్యారు. ఈయన 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ (IPS) అధికారి. ప్రస్తుతం ఈయన  పాట్నా శివారులోని బ్యాంకిపూర్ లో నివాసం ఉంటున్నారు.  గతేడాది ఆయన తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఈ ఏడాది మార్చిలో హిందూ సేన అనే పార్టీని స్థాపించి, బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించారు. లాండేపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు. అతని ఆస్తులు రూ. 20.74 లక్షలు..   వార్షిక ఆదాయం రూ. 26.8 లక్షలు. ఆయన భార్య మమత సంపన్నురాలు. వ్యాపారవేత్త అయిన ఆమె తనకు రూ.20.5 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని, అందులో రూ.60 లక్షల విలువైన ల్యాండ్ క్రూయిజర్ SUV, రూ.29 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో SUV, 100 గ్రాముల బంగారం, వివిధ బ్యాంకుల్లో వాటాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Also Read :  తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం.. నవంబర్ 24న బాధ్యతలు

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు

మిశ్రా బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని జిగ్నాకు చెందినవారు, అయితే అతని కుటుంబం భోజ్‌పూర్ జిల్లాకు చెందినది. అతని తండ్రి పరమహంస మిశ్రా కోల్‌కతాలో హిందూస్తాన్ మోటార్స్‌లో ఉద్యోగి. మిశ్రా కోల్‌కతాలో చదువుకుని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పోలీస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.  44 ఏళ్ల మిశ్రా అస్సాం కేడర్‌కు చెందినవారు. ఆయనకు  ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు కూడా ఉంది.  గత ఏడాది జనవరిలో ఆయన తన ఉద్యోగానికి రిజైన్ చేసి బీహార్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు..  బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు కానీ టికెట్ రాలేదు, దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు.  ఆయనకు కేవలం 47,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఓటమి తర్వాత ఆయన కొంతకాలం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో చేతులు కలిపి జన్ సురాజ్‌ను స్థాపించడంలో సహాయపడ్డారు.  కానీ ఈ ఏడాది ఆగస్టులో బీజేపీలో చేరారు. 

ఆనంద్ మిశ్రాకు రూ.2.5 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి, వాటిలో రూ.60 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇందులో 100 గ్రాముల బంగారం, రూ.2.51 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ బైక్ , బెంగాల్‌లోని హుగ్లీలో రూ.60 లక్షల విలువైన ఇల్లు కూడా ఉన్నాయి. ఆయన భార్య అర్చన తివారీకి రూ.88.4 లక్షల విలువైన చరాస్తులు, రూ.17 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మిశ్రా అఫిడవిట్ ప్రకారం, 2024/25 సంవత్సరానికి ఆయన వార్షిక ఆదాయం రూ.1.85 లక్షలుగా అంచనా వేయగా, ఆయన భార్య అర్చన రూ.12 లక్షలకు పైగా సంపాదిస్తుంది. 

Also Read :  దారుణం .. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని.. 2 కి.మీ. వెంటాడి మరీ చంపేశారు!

Advertisment
తాజా కథనాలు