/rtv/media/media_files/2025/05/12/FmBNSz9R4BmHvsPnRxxk.jpg)
Ahmed Sharif Chaudhry
Ahmed Sharif Chaudhry:
పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మాటలకు, చేతలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చేతల్లో ఏం చేయలేక పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. DG ISPR లెఫ్ట్‌నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్థాన్ ఆర్మీ గొప్పులు చెప్పుకొచ్చాడు. మేమేం పాలస్తీనా, ఇరాన్ కాదు. మాకు ఆ రెండు దేశాలకు సముద్రం అంత వ్యత్యాసం ఉందని లెఫ్ట్‌నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌తో గొడవకు వస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా తట్టుకోలేదని ఆయన హెచ్చరించారు.
Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్‌తో ఎంత దారుణంగా చంపించిందంటే..?
There’s a sea of difference between Palestine, Iran, and Pakistan. As a nuclear power, any misadventure against us will have consequences the world cannot endure — DG ISPR 🇵🇰 pic.twitter.com/j0KqCGQUYB
— Mansoor Ahmed Qureshi (@MansurQr) July 10, 2025
Also Read: ఆ ఉద్యోగుల ఉసురు పోసుకుని.. 4 వేల కోట్లు మిగుల్చుకున్న మైక్రోసాఫ్ట్.. షాకింగ్ లెక్కలు!
పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం.. మాతో పెట్టుకోవడం లేదా పెట్టుకోవాలనుకున్నా పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్‌కు ఆగ్రహం వస్తే ఆ పరిణామాలను ప్రపంచం తట్టుకోలేదని తెలిపారు. పాకిస్తాన్ అంటే ఏంటో ప్రపంచం ఇంకా చూడలేదు. నూక్లియర్ పవర్ ఉన్న మాలాంటి దేశంతో పెట్టుకోవాలంటే వాళ్లంత వెధవలు ఇంకొకరుండరని లెఫ్ట్‌నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రగల్భాలు పలికారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు పాక్ ఆర్మీ ఆఫీసర్ కామెంట్లపై సెటైర్లు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్‌లో దారుణంగా ఓడిపోయిన పాక్.. ఇప్పుడు మాటలతో కౌంటర్ ఇస్తుందని హేళన చేస్తున్నారు. ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ ఎదుర్కోలేని పాక్.. న్యూక్లియర్ దాడి చేస్తోందా అని నవ్వుతున్నారు. పహాల్గామ్ ఉగ్రదాడితో మొదలైన విభేదాలతో పాక్, ఇండియా యుద్ధ వాతారవణం తలపించింది.
Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!
Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..