Karnataka:  వెలుగులోకి మరిన్ని సంచలనాలు..ఐపీఎస్ రాసలీలలు.. ఈసారి ఆడియో రొమాన్స్ లీక్

కర్ణాటక డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం మరింత ముదురుతోంది. ఆయన రాసలీలల వీడియోలు సంచలనం సృష్టించగా తాజాగా ఆడియోలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపింది. తన ఆఫీసునే బెడ్‌రూమ్‌గా మార్చిన డీజీపీ మహిళలతో రాసలీలలు సాగించిన వీడియోలు తీవ్ర దుమారం రేపుతోంది.

New Update
FotoJet - 2026-01-20T162107.499

karnataka dgp scandal

Karnataka:  కర్ణాటక డీజీపీ అధికారి కె.రామచంద్రరావు(Karnataka DGP Ramachandra Rao) రాసలీలల వ్యవహారం(sex-scandal-case) మరింత ముదురుతోంది. ఆయన రాసలీలల వీడియోలు సంచలనం సృష్టించగా తాజాగా ఆడియోలు కూడా వెలుగులోకి రావడం మరింత సంచలనంగా మారింది.  తన ఆఫీసునే బెడ్‌రూమ్‌గా మార్చిన రామచంద్రరావు పోలీసు డ్రెస్‍లోనే మహిళలతో రాసలీలలు(Karnataka sex scandal) సాగించిన వీడియోలు బహిర్గతం కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వీడియోల వ్యవహారం వైరల్ అయిన కొన్ని గంటల్లోనే ఓ మహిళతో ఫోన్‍లో సరసలాడుతూ మాట్లాడిన ఆడియా వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియో  కూడా రామచంద్రరావుదేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో గుర్తుతెలియని మహిళతో రామచంద్రరావు సరసలాడిన ఆడియో ఇప్పుడు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది.

Also Read :  ఆఫీసులో రాసలీలు.. కర్ణాటక డీజీపీ సస్పెండ్

ఆడియో సంభాషణ ఇలా..

మహిళ: ఏమైంది ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు?
డీజీపీ: జిమ్‍లో ఉన్నాను. 7 గంటలకు జిమ్‍కు వెళ్లాను. ఇప్పుడే వచ్చాను. జిమ్‍లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్‍లో ఉండదు.
మహిళ: రాత్రంతా నువ్వే గుర్తొస్తున్నావ్
డీజీపీ.. ఆ.. ఆ.. హా... అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిద్రనే రాలేదు. మరి ఇంటికి రానా ఇప్పుడు?
మహిళ: ఇంటి చుట్టూ కెమెరాలున్నాయి.. ఇలా సాగింది..

Also Read :  కర్ణాటక డీజీపీ సెక్స్ స్కాండల్.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు!

అసలేం జరిగిందంటే..

కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని బెడ్‌ రూముగా మార్చి శృంగార లీలలకు పాల్పడ్డారు. ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. అనేకసార్లు, అనేక మందితో  ఆయన ఆఫీస్‌ క్యాబిన్‌నే బెడ్‌రూమ్‌గా మార్చుకుని అత్యంత అసభ్యంగా ప్రవర్తించారు. ఓ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకుని, ముద్దులు పెడుతూ సీసీ కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కర్ణాటకలో కలకలం రేగింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఈ రామచంద్రారావు తండ్రి కావడం గమనార్హం.

తాజాగా రామచంద్రారావు అశ్లీల వీడియోలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారకు ఆదేశించారు.  రాసలీలల వీడియోలు వైరల్ కావడంతో కె.రామచంద్రరావుపై కర్ణాటక సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈఘటనపై విచారణ చేపట్టిన ప్రభుత్వం మంగళవారం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ సమయంలో ప్రభుత్వ అనుమతి లేకుండా రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.

కాగా, కె. రామచంద్రరావు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ప్రభుత్వానికి మచ్చ తెచ్చేదిగా మారిందని ఆరోపించింది.  ఈ క్రమంలోనే ఆయన్ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, విధి నిర్వహణ సమయంలో సీనియర్‌ అధికారి ఇలా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆ వీడియోలను రామచంద్రరావు తోసిపుచ్చారు. అందులో ఉన్నది తాను కాదని, ఎవరో కుట్రపన్ని ఏఐతో వాటిని రూపొందించారని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు